E-Paper
Advertisement

February 13, Indian hackers: పాకిస్థాన్ మినిస్ట్రీపై భారత్ హ్యాకర్స్ కన్ను..

February 13, Indian hackers: పాకిస్థాన్ మినిస్ట్రీపై భారత్ హ్యాకర్స్ కన్ను..
Advertisement

Indian hackers targeted pakistan ministry

హ్యాకింగ్ అనేది ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సెల్‌ను విపరీతంగా భయపెడుతోంది. హ్యాకర్లు ఎక్కడ నుండి వస్తున్నారు, అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుండి లీక్ అవుతుంది అని తెలుసుకోవడానికే వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ సెల్ వారు ఒక్క అడుగు ముందుకేస్తే.. దాన్ని కనిపెట్టి సైబర్ క్రిమినల్స్ పది అడుగుల దూరం పారిపోతున్నారు. తాజాగా ఇండియన్ హ్యకర్స్ కన్ను.. పాకిస్థాన్ మినిస్ట్రీపై పడింది.
పాకిస్థాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ (మోఫా)పై వరుసగా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. దానిపై విచారణ చేసినవారికి షాక్ తగిలింది.

Advertisement

పాకిస్థాన్ మినిస్ట్రీపై సైబర్ అటాక్స్ చేస్తున్నవారు ఇండియన్ హ్యాకర్స్ అని తెలిసింది. మినిస్ట్రీ సిస్టమ్స్‌ను హ్యాక్ చేయడంతో పాటు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వారు దాని నుండి దొంగిలించినట్టుగా తెలుసుకున్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంటలిజెన్స్ అనలిస్ట్ జాకీ ఖలీద్ తన లింక్డ్ ఇన్ పోస్ట్‌లో బయటపెట్టారు. మరికొన్ని సైబర్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ఈ విషయంపైనే విచారణ చేపట్టారు.

బార్సిలోనాలో ఉండే పాకిస్థాన్ కాన్సూలేట్‌లోని వ్యక్తుల మధ్య వాట్సాప్ చాట్స్ కూడా ఈ సైబర్ అటాక్‌లో బయటపడ్డాయని తెలుస్తోంది. వారు దొంగిలించిన డేటా శాంపుల్స్ నిజమైనవా? కాదా? అని ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ సైబర్ అటాక్‌లో పలువురు పాకిస్థాన్ ప్రభుత్వ అధికారుల ఫోన్లు కూడా టాప్ అయ్యింటాయని జాకీ ఖలీద్ అనుమానం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ మినిస్ట్రీ మాత్రమే కాదు.. తాజాగా ఇండియన్ మినిస్ట్రీ కూడా హ్యాకింగ్‌కు గురయ్యిందని తెలుస్తోంది. ఇది ఇండియా, పాకిస్థాన్ మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవడం వల్ల జరిగిన అటాక్ అని జాకీ భావిస్తున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×