BigTV English

Plants: కోవిడ్ నుండి కాపాడే చెట్లు.. పరిశోధనలు మొదలు..

Plants: కోవిడ్ నుండి కాపాడే చెట్లు.. పరిశోధనలు మొదలు..
Plants which can inhibit covid were found

Plants which can inhibit covid were found

కోవిడ్ 19 ఒకేసారి ప్రపంచాన్ని కమ్మేసిన సమయంలో.. శాస్త్రవేత్తలకు, వైద్యులకు.. మనుషుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక రీసెర్చ్ గ్రూప్.. అసలు ఈ కోవిడ్ అనేది ఎందుకు వచ్చింది అనేదానిపై పరిశోధనలు చేస్తుంటే.. మరో రీసెర్చ్ గ్రూప్ మాత్రం దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడంలో నిమగ్నమయ్యారు. వ్యాక్సిన్ అనేది వచ్చి కోవిడ్ బారినుండి కొందరిని బయటపడేయడంతో ఇప్పుడు మరో కోణంలో పరిశోధనలు మొదలయ్యాయి.


కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలతో బిజీగా ఉన్నారు. తాజాగా శరీరంలో పెరిగే ఓ ప్రొటీన్.. కోవిడ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మరో విషయాన్ని గమనించారు. రెండు రకాల చెట్ల వల్ల కోవిడ్‌ను నిరోధిస్తుందని ఒక అమెరికా స్టడీలో తేలింది. ఆ రెండు చెట్లు.. టాల్ గోల్డెన్‌రాడ్, ఈగల్ ఫెర్న్. ఈ రెండు సార్స్ కోవిడ్ 2ను మనిషి శరీరంలోని సెల్స్‌లోకి రాకుండా నిరోధించడం శాస్త్రవేత్తలు గమనించారు. ఈ రెండు చెట్లలోని పువ్వులు, వేర్లలో అతి తక్కువ మోతాదులో కోవిడ్‌ను అరికట్టే సామర్థ్యం ఉందని వారు చెప్తున్నారు.

అమెరికా చేసిన ఈ పరిశోధనలను జార్జియా ఖండించింది. మహమ్మారి వ్యాధులకు ఇలాంటి చెట్లతో చికిత్స అందించడం చాలా ప్రమాదకరమని వారు విమర్శించారు. ముఖ్యంగా ఈగల్ ఫెర్న్ అనే చెట్టు చాలా ప్రమాదకరమైనదని వారు అన్నారు. కానీ జార్జియా విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా అమెరికా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆ చెట్లలోని అణువులను తెచ్చి ఐసోలేట్ చేసి.. పరిశోధనలను ప్రారంభించారు అక్కడి శాస్త్రవేత్తలు.


ప్రస్తుతం ఐసోలేట్ చేసిన అణువులను టెస్ట్ చేసి.. కోవిడ్ 19కు మందులుగా ఎలా పనిచేస్తాయో అన్నదానిపై పరిశోధనలు జరగనున్నాయి. కోవిడ్ అనేది మహమ్మారి వైరస్‌లాగా మానవాళిని ఇబ్బంది పెట్టడంతో.. దానిపై మరొకొన్ని పరిశోధనలు చేసి.. ఆపై ఈ చెట్లు దాని నివారణకు ఎలా తోడ్పడతాయో తెలుసుకోనున్నారు. అల్ఫా, తీట, డెల్టా, గామా లాంటి నాలుగు రకాల సార్స్ కోవిడ్ 2 వైరస్‌లపై ఈ చెట్లు పనిచేస్తాయని వారు తెలిపారు. భవిష్యత్తులో రానున్న ఎన్నో వ్యాధులకు నేచురల్‌గా పరిష్కారాలు కనుక్కోవడానికి.. ఇది తొలిమెట్టు అని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×