E-Paper
Advertisement

Investment Tips : ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్.. ఎప్పుడైనా, ఎవరైనా ఫాలో అవ్వొచ్చు

Investment Tips :  ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్.. ఎప్పుడైనా, ఎవరైనా ఫాలో అవ్వొచ్చు
Advertisement
Investment tips

Investment tips : ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ చేయాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్. ఇది చేయకుండా ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీలు తీసుకున్నా వేస్టే. ఎంత పాలసీ తీసుకోవాలనే డౌట్ ఉండొచ్చు. మీరు ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారో చూసుకుని దాని మీద కనీసం 10-12 రెట్లు టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిది. ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత బెనిఫిట్. టర్మ్ పాలసీ తీసుకున్న తరువాతే పెట్టుబడి, రాబడి గురించి ఆలోచించండి.

కొత్తగా పెళ్లైన వాళ్లు, పిల్లలు చిన్న వయసులో ఉన్న వాళ్లుంటే.. ఇప్పుడే మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్. ముఖ్యంగా ఆడపిల్ల ఉన్నవాళ్లు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నెలకు ఓ 10వేల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామనుకునే వాళ్లు.. అందులో ఓ 6వేల రూపాయలను సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌(సిప్)లో పెట్టడం మంచిది. అది కూడా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్ ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్. అంటే.. ఇందులో వివిధ సెక్టార్ షేర్స్ ఉంటాయి. ఒక్కో సీజన్‌లో ఒక్క సెక్టార్ మంచి లాభాలు ఇస్తుంది. అలాగే ఎనీటైమ్ బాగుండే సెక్టార్స్ కూడా ఉంటాయి. ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీలు అలాంటి షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్ ఎంచుకోవాలి. అవగాహన ఉంటే సొంతంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా ఓకే. బట్.. రోజూ పోర్ట్ ఫోలియో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఇక మిగిలిన 4వేల రూపాయలు సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టండి. ఇలా 14 ఏళ్లపాటు సుకన్య పథకంలో పెడుతూ వెళ్తే.. యావరేజ్‌గా 11 శాతం రాబడితో 36 లక్షల రూపాయలు మీ చేతికి అందుతాయి. ఆడపిల్ల ఉన్నత చదువులకో, మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకునేందుకో ఉపయోగపడతాయి.

ఇంట్లో పెద్ద వాళ్లు ఉండి.. వాళ్లకు నెలకు కొంత మొత్తంలో వడ్డీలా ఆదాయం వచ్చేలా చేయాలనుకుంటే మాత్రం పోస్ట్ ఆఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ మంచిది. పోస్టాఫీస్ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ ఇస్తుంది. ఓ 10 లక్షలు సేవింగ్స్ స్కీంలో పెడితే మూడునెలలకోసారి 20వేల రూపాయల వడ్డీ వస్తుంది.

Advertisement

ఒకవేళ మీరు చిరు వ్యాపారస్తులైతే.. 15 రోజులకోసారి 3వేల రూపాయల చొప్పున కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇందుకోసం.. మూడు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ చేతికి ఎప్పుడు డబ్బులు వస్తాయో.. ఆ రోజుల్లో ఇన్వెస్ట్ చేసేలా ప్లాన్ చేసుకోవచ్చు. అలా 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్‌గా 13 శాతం రాబడితో 13 లక్షల రూపాయలు ఆర్జించవచ్చు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×