BigTV English

Lizard : బల్లి చెప్పే శకునంలో నిజం ఉందా..?

Lizard : బల్లి చెప్పే శకునంలో నిజం ఉందా..?

Lizard : వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో బల్లి (Lizard) ఉంటే అది మహాలక్ష్మి తో సమానం అని పండితులు అంటున్నారు. ఆర్థిక కష్టాలు తొలగిపోయి మేలు కలుగుతుంది. పిల్ల‌లు లేదా పెళ్లి కానివారిపై బ‌ల్లి ప‌డితే ఆ ఫ‌లితం వారి త‌ల్లిదండ్రుల‌కు ఉంటుంది . బల్లి మనం ఒంటి మీద పడితే కూడా అది మంచి సంకేతమే. బల్లి కుడిపాదం పడితే అది చాలా మంచిది. అదే ఒకవేళ ఎడం పాదం మీద పడితే ప్రయాణాలు చేయబోతున్నారని దానికి సంకేతం. అలానే ఎడమ పాదం మీద కానీ కాలు మీద కానీ పడితే గొడవలు వస్తాయని బల్లిశాస్త్రం చెబుతోంది. మ‌డ‌మ‌ల వెనుక భాగంలో బ‌ల్లి ప‌డితే జైలును సంద‌ర్శిస్తారు. పాదాల సందుల్లో బ‌ల్లి ప‌డితే రోగాలు వ‌స్తాయి. కుడి తొడ‌పై బ‌ల్లి ప‌డితే సంతాన హాని, రెండు తొడ‌ల మీద బ‌ల్లి ప‌డితే సంతానానికి లాభం క‌లుగుతుంది. తొడ‌ల మొద‌ట బ‌ల్లి ప‌డితే నీర‌సం వ‌స్తుంది.


శిశ్నంపై బ‌ల్లి ప‌డితే సంతానం ప్రాప్తి, ధ‌నం, ధాన్యం ప్రాప్తిస్తాయి. లింగం మొద‌ట బ‌ల్లి ప‌డితే దాంప‌త్య సుఖం ఉండ‌దు. మ‌ర్మావ‌య‌వాల రోమాల‌పై బ‌ల్లి(Lizard) ప‌డితే దేశం విడిచి వెళ్తారు. పొట్ట‌పై బ‌ల్లి ప‌డితే ధ‌నం వ‌స్తుంది. నాభిపై అయితే స్త్రీ సౌఖ్యం క‌లుగుతుంది. వీపుకు ఎడ‌మ వైపు అయితే జ‌యం క‌లుగుతుంది. వీపుకు కుడి వైపున బ‌ల్లి ప‌డితే రాజ‌భీతి ఉంటుంది. చేతిపై బ‌ల్లి ప‌డితే డ‌బ్బు అంతా పోతుంది. అయితే బల్లి పడే శరీర భాగాన్ని బట్టి ఉంటుంది. చాలామంది బల్లి శరీర భాగాల మీద పడగానే పంచాంగం చూసి తెలుసుకుంటారు. ఒకవేళ కనుక మీరు రెండు బల్లలు కొట్టుకోవడానికి చూశారంటే అది ఇంట్లో కూడా గొడవలు వస్తాయని సూచన.ఇంట్లో బల్లులు కొట్టుకోవడాన్ని చూస్తే అది మానసిక సమస్యల్ని సూచిస్తుంది .

మగవారిపై బల్లి(Lizard) పడితే ఒక ఫలితం, అదే ఆడవారిపై మరో విధమైన ఫలితాలు ఉంటాయి. ఇద్దరికి ఒకేలా ఫలితాలు, ప్రభావాలు ఉండవు. అయితే కంచిలో బంగారు, వెండి బల్లిల్ని తాకి వస్తే ఎలాంటి చెడు ఫలితాలు ఉండవని పెద్దలు చెబుతుంటారు. ఒక వేళ కంచి కాని వెళ్లలేని వాళ్లు ఉంటే…కంచి వెళ్లిన వారిని ముట్టుకుని దోషాలు తొలగిపోవాలని కోరుకుంటే సరిపోతుందంటారు. ఒకవేళ దగ్గరలో ఎవరూ లేకపోతే పసుపు వేసిన నీళ్లతో స్నానం చేస్తే కొంత ఫలితం ఉంటుంది. కంచి వెళ్లలేని వారు హైదరాబాద్ పటాన్ చెరు దగ్గరల్లో ఉన్న కొడకంచి వెళ్లినా ఫలితం ఉంటుంది. ఆదినారాయణ స్వామి ఆలయం దర్శనానికి వెళ్తే ఈ మంచిదని నమ్మకం.


Related News

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Big Stories

×