BigTV English

Kasturi :- కస్తూరి ఇంట్లో ఏస్థానంలో పెడితే మేలు జరుగుతుంది?

Kasturi :- కస్తూరి ఇంట్లో ఏస్థానంలో పెడితే మేలు జరుగుతుంది?


Kasturi :- పరమ పవిత్రంగా భావించే కస్తూరిని పూజా మందిరంలో ఉంచి పూజిస్తే జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారికి మేలు జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఎరుపు రంగు జాకెట్టు బట్టలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచితే వృధాగా డబ్బు పోకుండా కాపుడబడుతుంది. కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమ ద్రవ్యంగా వాడాలని శ్రీ విష్ణు పురాణంలో ప్రస్తావించారు. మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయని దేవీ భాగవతం లో కూడా ఉంది.


నిజానికి కస్తూరి అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి. కస్తూరి ఉన్న ఇంట్లో విశేషమైన కనక లాభం ఉంటుంది ధనాభివృద్ధి జరిగి రుణ బాధలు ఉండవు. కార్యాలయంలో పనిచేసే పైఅధికారుల నుంచి వేధింపులు ఉండవని విశ్వాసం. వివాహ జీవితంలో కలిగే కలతలను, కష్టాలను పోగోడుతుంది.

పెళ్లైన జంటల మధ్య ఎలాంటి కలతలు, గొడవలు, అభిప్రాయ భేదాలు లేకుండా అన్యోన్యంగా కలిగి ఉంటారు. వ్యాపారస్తులు తమ గల్లా పెట్టాలో ఉంచితే ధనానికి లోటు ఉండదు. చేసే వ్యాపారం ఏదైనా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతుంది.

దిష్టి సమస్యలతో బాధపడే వారు అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది. ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా, మూర్థ, నరాల బలహీనత, ధనుర్వాతం, పక్షవాతం, మొదలయినవాటికి ఇది చక్కని మందుగా కూడా ఉపయోగపడుతుంది

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×