BigTV English

Manchu Manoj: నా వల్లే తారక్ చేతికి గాయం.. అసలు విషయం చెప్పిన మనోజ్!

Manchu Manoj: నా వల్లే తారక్ చేతికి గాయం.. అసలు విషయం చెప్పిన మనోజ్!

Manchu Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు మంచు మనోజ్ (Manchu Manoj)ఒకరు. మోహన్ బాబు వారసుడిగా బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్ అనంతరం హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించారు. హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మనోజ్ తన వ్యక్తిగత కారణాలవల్ల దాదాపు 9 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల భైరవం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మనోజ్ మిరాయ్(Mirai) సినిమాతో మరో పాన్ ఇండియా సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.


మిరాయ్ తో హిట్ కొట్టిన మనోజ్..

ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న మనోజ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అవుతున్నారు. ఇక ఈయన నటించిన మిరాయ్ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఎన్టీఆర్ చేతి గాయం(Hand Injury) గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం తన చేతికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మనోజ్ ఎన్టీఆర్ చేతికి తగిలిన గాయం గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ చేతికి గాయం కావడానికి తానే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యాడ్ షూట్ లో ప్రమాదం..


ఎన్టీఆర్ చేతికి గాయం కావడానికి మనోజ్ కి కారణం ఏంటి అనే విషయానికి వస్తే? ఎన్టీఆర్ చేతికి గాయం కావడానికి మనోజే కారణం కానీ ఇప్పుడు కాదండోయ్.. చిన్నప్పుడు కూడా మనోజ్ కారణంగా ఎన్టీఆర్ గాయపడ్డారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ మనోజ్ ఇద్దరూ ఒకే రోజు జన్మించిన సంగతి తెలిసిందే. అలాగే వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో చాలా మంచి స్నేహితులు చిన్నప్పుడు చాలా అల్లరి పనులు చేసే వాళ్ళం అంటూ పలు సందర్భాలలో మనోజ్ తెలియజేశారు.

ఇప్పటికీ గిల్టీగానే ఉంటుంది..

చిన్నప్పుడు ఒక రోజు తాను ఒక బెలూన్ అంటించి పెట్టానని అది ఖాళీ ఎన్టీఆర్ చేతి మీద పడటంతో పెద్ద గాయం అయిందని, ఎన్టీఆర్ చేతి పై ఉన్న ఆ మచ్చ తనని ఇప్పటికీ కూడా చాలా గిల్టీగా చేస్తుంది అంటూ మనోజ్ ఎన్టీఆర్ కి చేసిన గాయం గురించి ఈ సందర్భంగా తెలియచేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ తాజాగా ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొనగా ప్రమాదవశాత్తు ఆయన చేతికి గాయం తగిలింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలియజేశారు. ఇక ఎన్టీఆర్ చేతికి గాయం అయినప్పటికీ ఈయన ఆ యాడ్ షూట్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Devara Movie: థియేటర్‌లోకి దేవర.. ఫ్యాన్స్ మిస్ అవ్వకండి ఒక్క రోజే

Related News

K – Ramp : బూతులు గురించి క్లారిటీ, లేడీ రిపోర్టర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీనియర్ నరేష్

Devara Movie: థియేటర్‌లోకి దేవర.. ఫ్యాన్స్ మిస్ అవ్వకండి ఒక్క రోజే

Aryan Khan: ఏకంగా జక్కన్ననే ఒప్పించాడు, షారుక్ ఖాన్ కొడుకు మామూలోడు కాదు

Mohan Babu Look: ట్రోల్స్ ఎఫెక్ట్… మరో పోస్టర్ వచ్చేసింది… మరి దీంట్లో ఏం పెట్టారో ?

Parag Tyagi : తనని మర్చిపోలేక పోతున్నాను, పడుకునేటప్పుడు ఆమె బట్టలు పక్కలోనే..

RTC X Road: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు, త్వరలోనే గ్రాండ్‌ లాంచ్‌

Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి భర్త  రాజ్ కుంద్రా… ఈసారి ఏంటంటే?

Big Stories

×