BigTV English

OTT Movie : కిరాక్ క్రైమ్ థ్రిల్లర్ … సోదరి మీదే రివేంజ్ … ఈ లవ్ స్టోరీ కూడా తేడానే

OTT Movie :  కిరాక్ క్రైమ్ థ్రిల్లర్ … సోదరి మీదే రివేంజ్ … ఈ లవ్ స్టోరీ కూడా తేడానే

OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఒక చిన్న పొరపాటు వల్ల జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఎడమచేతి వాటం అనే చిన్న లైన్ తో ఈ సినిమా నడుస్తుంది. ఓ పక్క నవ్విస్తూనే మరో వైపు ఎమోషనల్ టచ్ తో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా డార్క్ కామెడీ, సస్పెన్స్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ సజెషన్. ఈ కన్నడ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ఎడగాయె అపఘాటక్కె కారణ’ (Edagayie apaghatakka karana) సమర్థ్ కడ్కోల్ దర్శకత్వం వహించిన కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఇందులో దిగంత్ మంచలె (లోహిత్), ధను హర్ష (రమ), నిధి సుబ్బయ్య (పూజ), నీరుప్ భండారి (కామియో) ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో 2025 జూన్ 13న విడుదలైన ఈ సినిమా, జూలై 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. 122 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.7/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

లోహిత్ ఒక సాధారణ ఐటీ ఉద్యోగి, తన స్నేహితురాలు పూజతో సమయం గడపడానికి రహస్యంగా ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్తాడు. అయితే అక్కడ ఊహించని విధంగా ఒక వ్యక్తి హత్యకి గురవుతాడు. ఈ సంఘటన లోహిత్‌ను గందరగోళంలో పడేస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి లోహిత్ పక్క అపార్ట్‌మెంట్‌లోకి చొరబడతాడు. అక్కడ అతను రమ అనే మహిళను కలుస్తాడు. ఆమె కూడా ఒక ఎదో తప్పు చేసినట్లు గందరగోళ స్థితిలో ఉంటుంది. లోహిత్ ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, అతని ఎడమ చేతి వల్ల సంభవించే చిన్న చిన్న పొరపాట్లు మరింత గందరగోళానికి దారితీస్తాయి.


లోహిత్ ఒక సమస్య నుంచి బయటపడే ప్రయత్నంలో మరో సమస్యలో చిక్కుకుంటాడు. కథలో ఒక అమ్మాయి ఎడమ చేతి వాటం వల్ల సైకోగా మారి తన సోదరిని చంపుతుంది. లోహిత్ ఎంట్రీతో ఈ సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయి. అయితే కొన్ని సీన్స్ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తూనే చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంటాయి. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఊహించని ఎమోషనల్ ట్విస్టులతో ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సినిమాలో లోహిత్ ఎడమ చేతి వాటంతో ఎదుర్కునే సమస్యలు ఏమిటి ? వీటినుంచి ఇతను ఎలా బయట పడతాడు ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read also :‘లిటిల్ హార్ట్స్’ నుంచి ‘ఓజీ’ దాకా ఓటీటీలో అక్టోబర్ సినిమాల జాతర… ఈ క్రేజీ సినిమాల్ని అస్సలు మిస్ అవ్వొద్దు

Related News

OTT Movie : పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు

Upcoming OTT Movies in October: ‘లిటిల్ హార్ట్స్’ నుంచి ‘ఓజీ’ దాకా ఓటీటీలో అక్టోబర్ సినిమాల జాతర… ఈ క్రేజీ సినిమాల్ని అస్సలు మిస్ అవ్వొద్దు

Little Hearts OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లిటిల్ హార్ట్…ఇక నాన్ స్టాప్ నవ్వులే!

Tollywood: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ మూవీ!

OTT Movie : వరుస మర్డర్స్ తో పోలీసులకు చెమటలు పట్టించే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : స్టూడెంట్ తో టీచర్ పాడు పని… ఒక్కో సీన్ కు మెంటలెక్కాల్సిందే భయ్యా

OTT Movie : అబ్బాయిలను వశపరుచుకుని కోరిక తీర్చుకునే ఆడ దెయ్యం.. అమ్మాయిలనూ వదలకుండా…

Big Stories

×