Shoaib Akhtar : ఆసియా కప్ 2025 లో భాగంగా సెప్టెంబర్ 28న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ అభిమానులు తామే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. అలాగే టీమిండియా అభిమానులు కూడా పాకిస్తాన్ తో ఫైనల్ లో ఎప్పుడూ టీమిండియాదే విజయం అని పేర్కొంటున్నారు. మరోవైపు 2018 విరాట్ కోహ్లీ కెప్టెన్సీగా ఉన్న సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో రిపీట్ అయినట్టు మళ్లీ రిపీట్ అవుతుందని పాకిస్తాన్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇంకొందరూ నెటిజన్లు పాకిస్తానీయులను భారత్ పై ఈసారి మనం పై చేయి సాధించాలన్న అంటూ క్రికెటర్లకు ప్రత్యేకంగా పోస్టులు పెట్టడం గమనార్హం.
Also Read : Asia Cup 2025 : పాకిస్తానీల అరాచకాలు.. గ్రౌండ్ లోనే లేడీ అభిమాని ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు!
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. టీమిండియా క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ మనిషి కాడు.. వాడు ఓ జంతువు అని సంచలన కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు తన క్రికెట్ రోజుల్లో అక్తర్ చాలా కోపంతో కనిపించేవాడు. 2025 ఆసియా కప్ లో ఇండియా- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కి ముందు ఇదే స్వభావంతో రెచ్చిపోయాడు. సెప్టెంబర్ 28న జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కి ముందు షోయబ్ అక్తర్ పాకిస్తాన్ జట్టుకు కిల్లర్ వైఖరీని అవలంభించాలని సందేశం ఇచ్చాడు. భారత జట్టు గర్వాన్ని అణిచివేసే ఉద్దేశంతోనే మైదానంలోకి రండి అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే పాకిస్తాన్ తట్టుకోవడం చాలా కష్టమే అని వెల్లడించాడు.
అందుకే అభిషేక్ శర్మను త్వరగా ఔట్ చేయాలని.. లేదంటే అతను మనిషి కాదు. ఓ జంతువు అని కామెంట్స్ చేయడం గమనార్హం. సెప్టెంబర్ 28న పాకిస్తాన్ జట్టు భారతదేశ గర్వాన్ని అణిచివేయాలని పేర్కొన్నాడు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ చేసిన సంచలన ప్రకటన పాకిస్తాన్ ఆటగాళ్లపై ఎంత వరకు ప్రభావం చూపుతుందో తెలియదు. కానీ ఇండియా- పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ పట్ల ఉత్సాహాన్ని పెంచింది. ఈ ఏడాది ఫైనల్ కూడా ప్రత్యేకమైంది. ఎందుకంటే..? 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో తొలిసారిగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్టు ఫైనల్ లో తలపడుతున్నాయి. 2025 ఆసియా కప్ లో సెప్టెంబర్ 14న గ్రూపు దశలో భారత్ – పాకిస్తాన్ మొదటిసారి తలపడ్డాయి. ఆ తరువాత వారం రోజుల తరువాత సెప్టెంబర్ 21న సూపర్ 4 దశలో తలపడ్డాయి. మళ్లీ ఆ తరువాత వారం రోజుల తరువాత సెప్టెంబర్ 28 న ఆదివారం రోజు టీమిండియా-పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు మ్యాచ్ లు ఆదివారం జరగడం.. అందులో రెండింటిలో కూడా టీమిండియానే ఘన విజయం సాధించడం విశేషం. ఫైనల్ కూడా విజయం సాధించి రికార్డు సృష్టించాలని భావిస్తోంది టీమిండియా.