OTT Movie : ఓటీటీలో ఓ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ కథలో ఊహించని ట్విస్టులు క్లైమాక్స్ దాకా ఉంటాయి. ఒక పోలీస్ అధికారి మర్డర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ నెల నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘పోలీస్ డే’ 2025 లో వచ్చిన ఒక మలయాళం క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సంతోష్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టిని టామ్ (లాల్ మోహన్), నందు (సైమన్ ఇడికుల), అన్సిబా హాసన్ (మానియా), ధర్మజన్ బోల్గట్టి (భాసి), హరీష్ కణారన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలై, సెప్టెంబర్ 4 నుంచి మనోరమామ్యాక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 46 నిమిషాల రన్‌టైమ్‌తోఈ చిత్రం IMDbలో 5.7/10 రేటింగ్ సాధించింది.
ఈ కథ కేరళలోని ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ సైమన్ అనే ఒక సీనియర్ పోలీస్ అధికారి, తన రిటైర్మెంట్ రోజు సాయంత్రం హఠాత్తుగా చనిపోతాడు. మొదటి చూపులో ఇది ఆత్మహత్యలా కనిపిస్తుంది. కానీ అతని మరణం వెనుక ఉన్న పరిస్థితులు అనుమానాస్పదంగా ఉంటాయి. సైమన్ ఒక నిజాయితీ పరుడైన పోలీస్ అధికారి. గతంలో అనేక కేసులను విజయవంతంగా పరిష్కరించినవాడు. కానీ అతని కఠినమైన వైఖరి వల్ల శత్రువులను కూడా సంపాదించుకున్నాడు. మరోవైపు అతని వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి. అతని భార్య షైని, కొడుకుతో విభేదాల కారణంగా అతను ఒంటరిగా, భాసి అనే పనివాడితో కలిసి ఉండేవాడు. ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేయడానికి IPS అధికారి లాల్ మోహన్ వస్తాడు. లాల్ మోహన్ ఒక తెలివైన అధికారి, అతను సైమన్ మరణంలో ఏదో తప్పుగా ఉందని భావిస్తాడు. దర్యాప్తు సాగుతున్న కొద్దీ, అతను సైమన్ జీవితంలోని రహస్యాలను, అతని శత్రువుల గురించి తెలుసుకుంటాడు.
అదే సమయంలో జీవ అనే నేరస్థుడు జైలు నుంచి తప్పించుకుంటాడు. ఇది కేసును మరింత ఇంటెన్స్ గా మారుస్తుంది. జీవ, సైమన్ కి మధ్య గతంలో జరిగిన గొడవలు ఈ దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తాయి. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, లాల్ మోహన్, సైమన్ మరణం ఆత్మహత్య కాదని, పక్కా ప్లానింగ్ మర్డర్ అని తెలుస్తుంది. కథలో ఊహించని ట్విస్ట్‌లు వస్తాయి. సైమన్ భార్య షైని, అతని సహోద్యోగి మానియా పై కూడా అనుమానాలు వస్తాయి. సైమన్ వ్యక్తిగత శత్రుత్వాల కారణంగా హత్యకు గురైనాడా? లేక ఇందులో పోలీసుల పాత్ర వుందా ? లాల్ మోహన్ ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు? నిజమైన నేరస్థుడు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఒంటరిగా ఉండే అమ్మాయి ఇంటికి రోజూ వచ్చే స్ట్రేంజర్… అర్ధరాత్రి అదే పని… వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్