Sarpanch Elections: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల అంశం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న సమయంలో ప్రభుత్వం జీవో ఇవ్వడం సరికాదని పేర్కొంది. అవసరం అయితే పది రోజుల పాటు ఎన్నికలను వాయిదా వేయొచ్చని తెలిపింది. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవద్దనుకుంటే సర్కార్ నిర్ణయం ఏంటో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేస్తూ తీర్పు నిచ్చింది.
సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషణ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ అభినందర్ ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు చిక్కుడు ప్రభాకర్, మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వర్చువల్ గా వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో జీవో ఇవ్వడం కరెక్ట్ కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అవసరమైతే సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేసుకోండి అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ఆధారంగా విచారిస్తామని క్లారిటీ ఇచ్చింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం తరఫు ఎంటో త్వరగా నిర్ణయం చెప్పాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
ALSO READ: CM Chandrababu: 15 నెలల్లో 4.7 లక్షల ఉద్యోగాలు.. ఇది మా ఘనత: సీఎం చంద్రబాబు