K – Ramp : కిరణ్ అబ్బవరం నటిస్తున్న K – Ramp సినిమాకి సంబంధించిన టీజర్ రీసెంట్ గానే విడుదలైంది. గతంలో విడుదల చేసిన టీజర్ కూడా బాగా వైరల్ అయింది. అయితే రీసెంట్ గా వచ్చిన టీజర్ లో రెండు మూడు చోట్ల బూతులు వినిపించాయి. చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రశ్నలను చాలామంది సినిమా జర్నలిస్టులు అడిగారు. అయితే ముఖ్యంగా టీజర్ లో ఉన్న బూతు పదాల గురించి ప్రశ్న వచ్చింది. దీనికి చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చింది.
ఈ సినిమాలో L వర్డ్ ఉపయోగించడం పైన ఉద్దేశం ఏంటి సినిమా ఓపెనింగ్స్ రావడం కోసమే ఇలా బూతులు పెడుతున్నారా అంటూ చిత్ర యూనిట్ కి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఓపెనింగ్స్ కోసం ఇలా బూతులు పెట్టాలి అనుకుంటే నేను స్వచ్ఛమైన “రాజావారు రాణి గారు” (Raaja Vaaru Raani Gaaru) లాంటి సినిమా చేయను. ఈ సినిమాలో క్యారెక్టర్ అలాంటిది కాబట్టి అది పెట్టాల్సి వచ్చింది అని చెప్పాడు.
అలా చెప్పగానే మరో తరుణంలో ఈ సినిమా ఫ్యామిలీస్ చూడొచ్చు అన్నారు కదా ఆడపిల్లలు ఎలా చూస్తారు అంటూ మరో లేడీ జర్నలిస్ట్ క్వశ్చన్ చేశారు. దానికి సమాధానం గా సినిమాలోని క్యారెక్టర్ ఉన్న సిచువేషన్ అలాంటిది కాబట్టి వాడు ఆ డైలాగ్ వాడాడు. వాడు టెన్షన్లో ఉన్నప్పుడు లూడో ఆడుదాం అని వేరేవాడు వచ్చి అడిగితే ” ఒక పది నిమిషాలు ఆగు నాకు వేరే పని ఉంది తర్వాత వచ్చి ఆడుతాను” అని ప్రాపర్ గా చెప్పలేడు. సినిమా చూసినప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. తప్పకుండా మీ మాటను కన్సిడర్ చేస్తాం అంటూ కిరణ్ ఆన్సర్ చేశాడు.
కిరణ్ మాట్లాడుతూనే ఒకప్పటి హీరో, ఇప్పుడు నటుడుగా ఎన్నో సినిమాలు చేస్తున్న సీనియర్ నరేష్ ఇదే విషయం గురించి మాట్లాడారు. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా వచ్చింది.
ఆ సినిమాలో ముగ్గురు ఫ్రెండ్స్ బండి మీద వెళుతూ.. అరె సరిగ్గా కూర్చోరా ____ సీన్ గుర్తు చేస్తూ ఉదాహరణగా చెప్పారు. ఆ సీన్ థియేటర్లో ఎంతగా పేలిందో అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు.
అలానే 1993లో వచ్చిన చిత్రం భళారే అనే సినిమాలో తాను నటించిన ఒక సీన్ గురించి కూడా చెప్పారు. లేడీ వేషంలో ఉన్న నేను లేడీస్ బాత్రూం లోనికి వెళ్లాను. అప్పుడు లేడీస్ అందరూ బయటకు వచ్చి అరుస్తారు. ఎందుకు అరుస్తున్నారు అంటే వాళ్ళు ఒక డైలాగ్ చెబుతారు. అప్పుడు సెన్సార్ వాళ్లు చిన్న మార్పు మాత్రమే చెప్పారు. అంటూ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎన్ని చెప్పినా కూడా ఆ లేడీస్ జర్నలిస్టు మాత్రం తన వాదనను ఆపలేదు.
Also Read: Bigg Boss 9: కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్, ఒక మెట్టు ఎక్కేసావయ్యా ఇమ్మానియేల్