BigTV English

Washington Sundar:-  వాషింగ్టన్ సుందర్ లేకపోవడం దెబ్బే.. ఈ 3 కారణాలు చెప్పుకోవాల్సిందే

Washington Sundar:-  వాషింగ్టన్ సుందర్ లేకపోవడం దెబ్బే.. ఈ 3 కారణాలు చెప్పుకోవాల్సిందే

Washington Sundar:- సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్ ఆటకు పూర్తిగా దూరం అయ్యాడు. తొడ కండరాల్లో గాయం కారణంగా ఇక నుంచి పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఆడిన ఏడు మ్యాచులలో మూడు వికెట్లు తీసుకున్నాడు. ఐదు ఇన్నింగ్సులలో బ్యాటింగ్ చేసి 60 పరుగులు చేశాడు. నిజానికి ఇవేం ఇంప్రెసివ్ నెంబర్స్ కాకపోయినప్పటికీ.. టీ20లో వాషింగ్టన్ లాంటి ఆటగాడు ఉండాల్సిందే. అవసరమైనప్పుడు బౌలింగ్ చేస్తూ, అత్యవసర సమయంలో బ్యాట్ తోనూ ఆడగలడు.


1. బ్యాటింగ్
సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ సూపర్. కాకపోతే, పేపర్ మీదే ఆ గ్రేట్‌నెస్ మొత్తం. ఇప్పటి వరకు స్థాయికి తగ్గట్టుగా ఆడిందే లేదు. హ్యాట్రిక్ ఓటములతో పూర్తిగా డీలాపడిపోయింది హైదరాబాద్ జట్టు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టులో మయాంక్ అగర్వాల్ ఒక్కడే హైయెస్ట్ స్కోరర్. 164 పరుగులు చేశాడు. ఇలాంటి సమయంలో వాషింగ్టన్ సుందర్ లేకపోతే.. ఆ మాత్రం బ్యాటింగ్ కూడా ఉండదు.

2. స్పిన్ బౌలింగ్
ఈ సీజన్‌లో అతి తక్కువ వికెట్లు తీసిన స్పిన్నర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లే. ఆడిన 7 మ్యాచులలో స్పిన్నర్స్ తీసిన వికెట్స్ 13 మాత్రమే. మయాంక్ మార్కండే ఒక్కడే 8 వికెట్లు తీశాడు. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ వెళ్లిపోతే.. ఇక స్పిన్ బౌలింగ్ మరింత వీక్ అయినట్టే.


3. రీప్లేస్ చేసే ఆటగాడెవరు?
ఆల్ రౌండర్స్‌ను రీప్లేస్ చేయడం చాలా కష్టం. అందులోనూ స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్, మంచి ఫీల్డింగ్‌తో ఆడగలిగే రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌ను వెతకడం ఇప్పటికిప్పుడు అసాధ్యం. అదే వాషింగ్టన్ సుందర్ ఉంటే.. పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు. మిడిల్ ఓవర్లలోనూ మిగతా బౌలర్లకు సపోర్టుగా ఉండగలడు. ఈ మధ్యే హిట్టంగ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఈ సమయంలో సుందర్ లేకపోవడం హైదరాబాద్ జట్టుకు పెద్ద దెబ్బే. 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×