BigTV English

Lakshmi Narasimhaswamy:-కర్పూరం వెలుగులో మాత్రమే కనిపించే లక్ష్మీ నరసింహస్వామి..

Lakshmi Narasimhaswamy:-కర్పూరం వెలుగులో మాత్రమే కనిపించే లక్ష్మీ నరసింహస్వామి..

Lakshmi Narasimhaswamy:-శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు స్వయంభుగా వెలసిన ప్రాంతం కోరుకొండ. భక్తుల బక్తులు కోరికలు నేరవేరుస్తున్నాడు .14వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో అద్బుతమైన శిల్పకళతో ఉంటుంది. కొండ పై ఉన్న దేవాలయాన్ని చేరుకోవాలంటే సుమారు 615 మెట్లు ఎక్కాలి ఉంటుంది. ప్రతిమెట్టు లంబకోణ ఆకృతిలో ఉండటం వల్ల, కొండ వాలు తక్కువగా ఉండటం వల్ల పైకి ఎక్కడం కొంచం కష్టతరమే. ఆలయం ద్వాపర యుగం నాటిదని చరిత్ర మనకి చెబుతోంది. ప్రస్తుతం ఆలయ పాలన వ్యవహారాలను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పర్యవేక్షిస్తుంది.


మంచి కొండ రెడ్డిరాజులు క్రీ.శ. 1325, 1395 మధ్య కోరుకొండను రాజధానిగా చేసుకుని 70ఏళ్లు పరిపాలించారు. కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దారు.

కోరుకొండ కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కృతయుగంలోనే స్వయంవ్యక్త స్వయంభూగా ఆవిర్భవించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతుంది.లక్ష్మీ సమేత నరసింహస్వామి స్వయంభూ విగ్రహం 9అంగుళాల ఎత్తులో కోరుకొండ కొండపై ఉత్తరాభిముఖంగా ఉంది.స్వామి దర్శనానికి కొండపైకి వెళ్లిన భక్తులకు కర్పూరం వెలుగులో అర్చక స్వాములు స్వామివారి విగ్రహాన్ని చూపిస్తారు. సింహద్వారానికి ఎదురుగా పశ్చిమాభిముఖంగా స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి ఉంది. ముఖమండపంలో లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ద్వారానికి అటు..ఇటూ ముమ్మిడి నాయకుడు , భార్యలక్ష్మీదాసి విగ్రహాలు ఉన్నాయి.


కొండపైనా ఆవరణలో వైకుంఠనాధుని ఆలయం ఉంది. అక్కడ 12 మంది అళ్వార్‌ల విగ్రహాలు ప్రతిష్ఠించి వున్నాయి. ఫాల్గుణ మాసం లో స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది . కృష్ణాష్టమి, ఉగాది,ముక్కోటి ఏకాదశి మరియు ఇతర ముఖ్య పండుగలకు ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×