E-Paper
Advertisement

Latest Technology : 90 వేల ఏళ్ల క్రితం రాళ్లను గుర్తించే టెక్నాలజీ..

Latest Technology  : 90 వేల ఏళ్ల క్రితం రాళ్లను గుర్తించే టెక్నాలజీ..
Advertisement
Latest  Technology

Latest Technology : మామూలుగా ఆర్కియాలజిస్ట్స్‌కు దొరికే వస్తువులు.. ముఖ్యంగా రాళ్లు అనేవి ఈనాటివి కావు. ఎన్నో వందల, వేల ఏళ్ల క్రితానికి చెంది ఉంటాయి. అయితే ఒకప్పుడు ఈ రాళ్ల వయసును కనుక్కోవడం కోసం శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందిన తర్వాత దీనికోసం పలు విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందులోని ఫేమస్ అయిన ఇసోటోపిక్ డేటింగ్ ప్రక్రియ గురించి శాస్త్రవేత్తలు తాజాగా బయటపెట్టారు.

వందలు మాత్రమే కాదు.. వేల్ల ఏళ్ల క్రితం రాయి గురించి అయినా ఇసోటోపిక్ డేటింగ్ ప్రక్రియ ద్వారా కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్కియాలజిస్ట్స్ ఎక్కువగా కార్బన్ ఇసోటోప్‌ను రాళ్ల వయసును గుర్తించడం కోసం ఉపయోగిస్తున్నారు. కార్బన్ ఇసోటోప్ డేటింగ్ 14సి అనే ప్రక్రియ 50 వేల ఏళ్ల క్రితం రాళ్లను కూడా గుర్తించగలదు. ఇక కాస్మోజెనిక్ ఇసోటోప్ అనే 41 సీఏ అనే ప్రక్రియ అయితే ఏకంగా 99 వేల ఏళ్ల క్రితం రాళ్లను కూడా గుర్తించగలదు.

Advertisement

కాస్మోజెనిక్ ఇసోటోప్ 41 సీఏ అనే ప్రక్రియ.. కార్బన్ ఇసోటోప్ 14 సీ కంటే 17 రెట్లు మెరుగ్గా పనిచేస్తుంది. ఇప్పటివరకు రాళ్ల వయసును గుర్తించడం కోసం కాస్మోజెనిక్ ఇసోటోప్ ప్రక్రియ మెరుగైనదని ఆర్కియాలజిస్ట్స్ భావించేవారు. కానీ దానికంటే మెరుగైన మరో ప్రక్రియను ఇటీవల శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ కోణంలో ఆటమ్ ట్రాప్ ట్రేస్ అనాలసిస్ (ఆట్టా) ద్వారా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు సక్సెస్ కూడా అయ్యాయని వారు ప్రకటించారు.

ఎప్పుడో భూమిలో పాతుకుపోయిన రాళ్లను, మనుషుల అస్థికలను గుర్తించడానికి, వాటి వయసు ఎంత ఉంటుందో కచ్చితంగా చెప్పడానికి ఆట్టా మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీని గురించి మరిన్ని పరిశోధనలు చేసి.. దీనిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం కోసం ప్రపంచ దేశాల జియోలజిస్ట్స్, ఆర్కియాలజిస్ట్స్‌తో శాస్త్రవేత్తలు కలిసి పనిచేయనున్నారు. ఇది ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఉపయోగపడే కొత్త ప్రయోగం అని శాస్త్రవేత్తలు గర్వంగా చెప్తున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×