BigTV English

MI New Smartphone : DSLR కెమెరాను మరిపించేలా సరికొత్త స్మార్ట్ ఫోన్…

MI New Smartphone : DSLR కెమెరాను మరిపించేలా సరికొత్త స్మార్ట్ ఫోన్…

MI New Smartphone : ఈ మధ్య మార్కెట్ ను ముంచెత్తుతున్న స్మార్ట్‌ఫోన్‌లు… అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో యూజర్లను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కెమెరా టెక్నాలజీలో వస్తున్న మార్పులతో… DSLR కెమెరా క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా… ఎక్కువ పిక్సెల్‌ సామర్థ్యం కలిగిన కెమెరాలతో… బడ్జెట్‌ ధరల్లోనే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. క్వాలిటీ కెమెరాతో పాటు కాలింగ్, చాటింగ్‌, బ్రౌజింగ్‌ వంటి ఫీచర్లు కూడా ఎప్పుడూ అరచేతిలోనే ఉండే సౌకర్యం ఉంది కాబట్టి… సంప్రదాయ కెమెరాలకు బదులు ఎక్కువ మంది మొబైల్ కెమెరాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. అలాంటివారి కోసం… DSLR లెన్స్‌ అమర్చుకునే ఫీచర్‌తో షావోమి కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది.


12S అల్ట్రా పేరుతో షావోమి తీసుకొస్తున్న ఈ ఫోన్‌ కెమెరాను మిర్రర్‌లెస్‌ కెమెరాగా మార్చుకోవచ్చు. ఇందులో ఒక 50 మెగాపిక్సెల్, రెండు 48 మెగాపిక్సెల్ కెమెరాలుంటాయి. వీటిలోని ఒక దానితో సాధారణ మొబైల్ కెమెరాలా ఫోటోలు తీసుకోవచ్చు. ఫోన్‌కు లైకా M-సిరస్‌ లెన్స్‌ అమర్చాక… మిగతా లెన్స్‌ పనిచేస్తాయి. లెన్స్‌ అమర్చిన వెంటనే కెమెరా ఫోకల్‌ లెంగ్త్‌ను కూడా యూజర్‌ మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఐఓఎస్‌, షట్టర్‌ వంటి వాటిని కూడా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. లెన్స్‌ అటాచ్‌మెంట్ ఫీచర్‌తో వస్తోన్న ఈ తరహా స్మార్ట్ ఫోన్లు… భవిష్యత్తులో సాధారణ DSLR కెమెరాలకు ప్రత్యామ్నాయంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే మోటోరోలా ఇదే తరహాలో అటాచబుల్‌ హాసెల్‌బాల్డ్‌ లెన్స్‌తో మోటో జెడ్‌ సిరీస్‌లో ఫోన్‌ను విడుదల చేసింది. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆ ఫోన్‌ తయారీని నిలిపివేసింది. మరిప్పుడు షావోమి తీసుకొస్తున్న 12S అల్ట్రాలో… ఇతర ఫీచర్లు ఇంకా ఏమేం ఉంటాయి? అది వినియోగదారులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది? అనేది ఫోన్ రిలీజయ్యాక కానీ తెలీదు.


Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×