Big Stories

Musk Warning : వేషాలేస్తే వేటే.. మస్క్ వార్నింగ్..

Musk Warning : ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత పూటకో నిర్ణయంతో సంచలనం సృష్టిస్తున్న మస్క్… ఇప్పుడు యూజర్ల మీద పడ్డాడు. ప్రముఖులు, పాపులర్‌ పేర్లతో ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్‌ చేసి… సరదా కంటెంట్‌ పోస్ట్‌ చేసేవాళ్లకు చెక్ పెట్టాలని డిసైడయ్యాడు. అలాంటి అకౌంట్లకు ఇకపై పేరడీ అనే లేబుల్ లేకపోతే… శాశ్వతంగా క్లోజ్ చేస్తామని మస్క్ ప్రకటించాడు.

- Advertisement -

ఫన్నీ కంటెంట్‌ క్రియేషన్‌ పేరుతో ప్రముఖలు, పాపులర్‌ పేర్లను ఉపయోగించి కొందరు ట్విటర్‌లో పేరడీ అకౌంట్లు కొనసాగిస్తున్నారు. ఇకపై వాళ్లు పేరడీ అని ట్విటర్‌ హ్యాండిల్‌లో స్పష్టంగా పేర్కొనాలి. లేదంటే… ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే ఆ ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తామని మస్క్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి అకౌంట్ ఉన్నవారిని గతంలో ముందుగా హెచ్చరించి… ఆ తర్వాతే చర్యలు తీసుకునేవాళ్లు. కానీ, ఇకపై పేరడీగాళ్ల ఆటలు ఇక సాగవని స్పష్టంగా చెప్పేశారు… మస్క్. ఇటీవల ఎలన్‌ మస్క్‌ పేరుతో… అది కూడా వెరిఫైడ్‌ మార్క్‌తో ఓ ప్రొఫైల్‌ నుంచి భోజ్‌పురి పదాలతో ఉన్న ట్వీట్‌ విపరీతంగా వైరల్‌ అయ్యింది. అది పేరడీ అకౌంట్‌ కావడంతో ట్విట్టర్‌ ఆ అకౌంట్ ను శాశ్వతంగా క్లోజ్ చేసింది.

- Advertisement -

ఇకపై అకౌంట్‌ సైనప్‌ చేసేటప్పుడే పేరడీపై నిబంధనల్ని స్పష్టం చేయబోతోంది… ట్విట్టర్. పేరడీ అకౌంట్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడమే కాదు… ఇకపై పేరులో ఏదైనా మార్పు చేసినా… తాత్కాలికంగా ధృవీకరించిన చెక్‌మార్క్‌ కోల్పోతారని మస్క్ ప్రకటించాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News