BigTV English

Horoscope Today August 15th:  నేటి రాశి ఫలాలు:  ఆ రాశి వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today August 15th:  నేటి రాశి ఫలాలు:  ఆ రాశి వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 15వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేషరాశి:  మెడ/ వెన్నులో విపరీతమయిన నొప్పితో బాధపడే అవకాశమున్నది.  అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే, అసలు నిర్లక్ష్యం చెయ్యకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. ఆర్థికపరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడతారు జాగ్రత్త.  ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు.

లక్కీ సంఖ్య: 3


 

వృషభరాశి: ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు.   ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. వారి యొక్క సలహా వలన మీరు మీ ఆర్థిక స్థితి దృఢ పరుచుకోగలరు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి.

లక్కీ సంఖ్య: 2

 

మిథునరాశి: ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి.

లక్కీ సంఖ్య: 9

 

కర్కాటకరాశి: మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరినీ రిలాక్స్ అయేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది.

లక్కీ సంఖ్య: 3

 

సింహరాశి: ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం. మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయీ రోజు.

లక్కీ సంఖ్య: 2

 

కన్యారాశి: మితిమీరి తినడం మాని, అధికబరువు పొందకుండా చూసుకొండి. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు , నక్షత్రాల యొక్క స్తితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మీ కరకు ప్రవర్తన, నిక్కచ్చితనం, మీ ఇంటివారిని, దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది.

లక్కీ సంఖ్య: 9

 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి: మీ సంకల్ప బలం తో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవడం వలన అది ప్రశంసలను పొందుతుంది. ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో, మీరు సంయమనాన్ని పోగొట్టుకోరాదు. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీకు కుటుంబంతోను, స్నేహితులతోను చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది.

లక్కీ సంఖ్య: 3

 

వృశ్చికరాశి: ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసి ఉన్నది. మీఛార్మింగ్ వ్యక్తిత్వం,  ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, సహాయ పడతాయి.

లక్కీ సంఖ్య: 4

 

ధనస్సురాశి: మితిమీరి తినడం మాని, ఆరోగ్యంగా దృడంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్ లకి వెళ్తుండండి. మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు, లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు.

లక్కీ సంఖ్య: 1

 

మకరరాశి: మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపాలంటే, మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. మీ బిడ్డ మీ అంచనాలకు తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చెయ్యండి. కానీ అద్భుతాలు జరుగుతాయని అతడు ప్రయత్నించినంత మాత్రాన అనుకోవద్దు. కాకపోతే మీ ప్రోత్సాహం అతడికి తప్పకుండా ఉత్సాహాన్నిస్తాయి.

లక్కీ సంఖ్య: 1

 

కుంభరాశి: యతి వంటి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. మీరు విధ్యార్దులు అయితే, మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు అయితే మీ ఇంటి ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను నిరాశకు, భాదకు గురిచేస్తాయి. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే, అది మీకు చాలా మేలు చేస్తుంది.

లక్కీ సంఖ్య: 8

 

మీనరాశి: మీరు యోగాతో, ధ్యానంతో రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ ల గురించి చెప్పడానికిది మంచి సమయం.

లక్కీ సంఖ్య: 6

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Love Marriage: లవ్ మారేజెస్ ఎక్కువగా ఆ రాశుల్లో పుట్టిన వారికే జరుగుతాయట

4 Yogas: ఆ 4 యోగాలు ఉన్న స్త్రీలకే ధనవంతులైన భర్తలు లభిస్తారట

Conflict Reasons: ఇంట్లో తరుచుగా గొడవలు జరుగుతున్నాయా..? మనఃశాంతి ఉండటం లేదా.? అయితే ఆ 6 కారణాలు అయ్యుండొచ్చు

Wealth Numerology: న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీల్లో పుట్టిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

Horoscope Today August 14th: నేటి  రాశి ఫలాలు:  ఆ రాశి వారు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి

Big Stories

×