BigTV English

Pooja Hegde: కూలీ డిజాస్టర్ టాక్.. పూజా హెగ్డే ఐరెన్ లెగ్ అంటూ ట్రోలింగ్ ?

Pooja Hegde: కూలీ డిజాస్టర్ టాక్.. పూజా హెగ్డే ఐరెన్ లెగ్ అంటూ ట్రోలింగ్ ?

Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సులు… రాక సతమతమవుతున్న పూజా హెగ్డే కు కూలీ రూపంలో బంపర్ ఆఫర్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే మంచి సాంగ్ కూడా ఆమెకు పడింది. దీంతో కూలీ సినిమాతో పూజా హెగ్డే కెరీర్ ఒక్కసారిగా మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. ఇప్పుడు హీరోయిన్ పూజ హెగ్డే ను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె ఈ సినిమాలో నటించడం కారణంగానే… కూలీ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


గ్రాండ్ గా రిలీజ్ అయిన రజినీకాంత్ కూలీ

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన సినిమా కూలీ. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కళానిధి మారన్ డబ్బులు పెట్టారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో కనిపించారు. అక్కినేని నాగార్జున తో పాటు పూజా హెగ్డే, శృతిహాసన్, అమీర్ ఖాన్, మరో స్టార్ నటుడు సౌబిన్ షాహీర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆగస్టు 14 అంటే ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా… మిక్స్డ్ టాక్ తెచ్చుకుందని చెప్పవచ్చు. కొంతమంది ఈ సినిమా బాగుందని అంటుంటే… మరికొంతమంది డిజాస్టర్ అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. అయితే ఈ కూలీ సినిమా కలెక్షన్స్ మాత్రం బాగానే రాబడుతుందని అంచనా వేస్తున్నారు సినీ ప్రముఖులు. ఇలాంటి నేపథ్యంలోనే పూజ హెగ్డే అంశం తెరపైకి వస్తోంది.


ఐరన్ లెగ్ అంటూ పూజా హెగ్డే పై ట్రోలింగ్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా అందరూ పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఇది పూర్తిగా దర్శకత్వ లోపం అని చెప్పవచ్చు. అయితే… హీరోయిన్ పూజ హెగ్డే ఈ సినిమాలో నటించడం వల్లనే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందని కొంతమంది దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఆమె నటించిన సినిమాలన్నీ ఇలాగే అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని… అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కూడా ఇవ్వడం లేదని కొంతమంది అంటున్నారు. ఏదో ఒక ఛాన్స్ ఇద్దామని కూలీ సినిమాలో ఆమెకు ఇస్తే… అందరినీ ఖుని చేసిందని ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ ఎవరైనా ఉన్నారంటే అది పూజా హెగ్డే అంటూ మండిపడుతున్నారు. ఇకపై ఆమెను సినిమాల్లోకి తీసుకోకూడదని కోరుతున్నారు. అయితే మరి కొంత మంది ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. దర్శకుడు చెప్పిన విధంగా పూజ హెగ్డే చాలా బాగా చేశారని అంటున్నారు. మోనికా సాంగ్ తో సినిమాకు హైప్ వచ్చిందని… దీనికి కారణం హీరోయిన్ పూజా హెగ్డే అంటున్నారు. అలాంటి పూజ హెగ్డే ఐరన్ లెగ్ ఎలా అవుతుందని నిలదీస్తున్నారు.

Also Read: Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !

Related News

Vishwambara update : బాస్ బర్తడే కి టీజర్ ఫిక్స్, ఈసారైనా జాగ్రత్త పడ్డారా?

Bollywood Entry: మొత్తానికి ముగ్గురు హీరోలకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్

Soundarya Rajinikanth: కూలీ సినిమా రివ్యూ ఇచ్చిన రజనీకాంత్ కుమార్తె

Nagarjuna Coolie: కథను 7 సార్లు విన్నాక నాగార్జున ఎలా ఓకే చేశాడు అనేదే బిగ్గెస్ట్ మిస్టరీ

SIIMA 2025 : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు, వాళ్లతో విభేదాలు?

Big Stories

×