Vishwambara update : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ కాబోతున్న భారీ ప్రాజెక్ట్స్ లో వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర సినిమా ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బింబిసారా సినిమా తర్వాత వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నాడు అంటేనే హైప్ విపరీతంగా క్రియేట్ అయింది. అంతేకాకుండా ఇది ఒక సోషియో ఫాంటసీ జోనర్ సినిమా అని అనౌన్స్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ జోనర్ లో సినిమా చేసి చాలా రోజులైంది. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తర్వాత ఈ జోనర్ సినిమా చేయలేదు. అయితే వశిష్టత అనౌన్స్మెంట్ రాగానే, విశ్వంభర సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి రేంజ్ లో ఉండబోతుంది అని అందరూ ఊహించరు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది.
అంచనాలు తగ్గించిన టీజర్
ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండేవి. దీనికి కారణం వశిష్ట దర్శకత్వం వహించిన మొదటి సినిమా పెద్ద సక్సెస్ కావడం. అయితే ఈ టీజర్ మాత్రం ఉన్న అంచనాలను తగ్గించేసింది అని చెప్పాలి. నాసిరకం విఎఫ్ఎక్స్ వాడారు అని అందరూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఇదంతా కూడా టీం దృష్టికి చేరి సినిమా మీద మరింత దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాని చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు వశిష్ట. సిజి విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమా లైన్ కూడా పలు ఇంటర్వ్యూస్ లో చెప్పేసాడు.
స్టోరీ, టీజర్ అప్డేట్
ఈ సినిమాలో హీరో 14 లోకాలను దాటి తనకు కావాల్సింది తెచ్చుకుంటాడు అనే కథను వశిష్ట పలు ఇంటర్వ్యూస్ లో చెప్పేసాడు. కథ చెప్పడానికి గల కారణం తనకు సినిమా మీద ఉన్న నమ్మకం అని తెలిపాడు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆగస్టు 22న టీజర్ విడుదల చేస్తున్నారు. అయితే ఈ టీజర్ గురించి బేబీ దర్శకుడు సాయి రాజేష్ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. టీజర్ అదిరిపోయింది అని ఆ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. అలానే ఏ టీజర్ వలన అయితే సినిమా పైన ట్రోలింగ్ వచ్చిందో, రిలీజ్ కాబోయే అదే టీజర్ అంచనాలు పెంచుతుంది అని సాయి రాజేష్ తెలిపాడు.
Also Read: Soundarya Rajinikanth: కూలీ సినిమా రివ్యూ ఇచ్చిన రజనీకాంత్ కుమార్తె