Muralitharan vs Gambhir: టీం ఇండియా మాజీ స్టార్ ఆటగాడు, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి తెలియని వారు ఉండరు. చాలా కోపంగా ఉండే గౌతమ్ గంభీర్ టీమ్… ఇండియాకు చాలా విజయాలనే అందించారు. 2011 సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ రావడంలో ప్రధాన పాత్ర పోషించారు గౌతమ్ గంభీర్. ప్రస్తుతం హెడ్ కోచ్ గా కొనసాగుతున్న గౌతమ్ గంభీర్… భారతదేశం కోసం మరిన్ని సేవలు అందిస్తున్నారు. అలాంటి గౌతమ్ గంభీర్ పరువు తీశాడు శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. గౌతమ్ గంభీర్ కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్ గా రికార్డు లోకి ఎక్కారు ముత్తయ్య మురళీధరన్.
Also Read: Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !
గంభీర్ కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ముత్తయ్య మురళీధరన్
అంతర్జాతీయ క్రికెట్లో ముత్తయ్య మురళీధరన్ .. ఒకప్పుడు వెలుగు వెలిగాడు. అర్థం కాని అదిరిపోయే స్పిన్ బౌలింగ్ వేస్తూ… చాలా వికెట్లు తీశారు ముత్తయ్య మురళీధరన్. షేన్ వార్న్ అప్పట్లో చరిత్ర సృష్టిస్తే…. అతనికి పోటీగా ముత్తయ్య మురళీధరన్ నిలిచేవాడు. అయితే అలాంటి ముత్తయ్య మురళీధరన్ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతడు క్రికెట్ ఆడకపోయినప్పటికీ… ఓ స్టార్ ఆటగాడి పరువు మొత్తం తీసేశాడు. టీమిండియా జట్టు హెడ్ కోచ్గా కొనసాగుతున్న గౌతమ్ గంభీర్ రికార్డును బద్దలు కొట్టాడు. అతని కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు ముత్తయ్య మురళీధరన్. ఇప్పటివరకు 328 ఇన్నింగ్స్ లు ఆడాడు ముత్తయ్య మురళీధరన్. ఈ అంతర్జాతీయ మ్యాచులలో మొత్తం 41 సిక్సర్లు బాదాడు ముత్తయ్య మురళీధరన్.
ఎప్పటినుంచో శ్రీలంక జట్టుకు విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ముత్తయ్య మురళీధరన్… అందరికంటే చివరలో బ్యాటింగ్ చేసినప్పటికీ 41 సిక్సర్లు కొట్టడం చాలా గ్రేట్ అంటున్నారు. ఇక ఓపెనర్ గా బరిలోకి దిగే టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్… కేవలం 37 సిక్సర్స్ మాత్రమే కొట్టాడు. 283 మ్యాచ్ లు ఆడిన గౌతమ్ గంభీర్ ఇప్పటివరకు 37 సిక్సర్లు మాత్రమే బాదాడు. ఓపెనర్ గా బ్యాటింగ్ చేసినప్పటికీ గౌతమ్ గంభీర్ సిక్సలకంటే బౌండరీలు ఎక్కువగా కొట్టాడు. విధంగా 1078 సిక్సర్లు… కొట్టేసాడు గౌతమ్ గంభీర్. అయితే దీనికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ చూసిన మహేంద్ర సింగ్ ధోని అభిమానులు అలాగే కోహ్లీ అభిమానులు రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. ఒక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ కొట్టిన అన్ని సిక్సర్లు కూడా కొట్టలేకపోయావా ? ఏం బతుకు నీది అంటూ గౌతమ్ గంభీర్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇలాంటి వాడికి ఈ టీమిండియా హెడ్ కోచ్ పదవి ఇస్తారా అని నిలదీస్తున్నారు.
Also Read: Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్