E-Paper
Advertisement

OTT Movie : ఫ్యామిలీనీ వేధించే పిల్ల దెయ్యం… గుండె ధైర్యం ఉన్నవాళ్ళు చూడాల్సిన హారర్ మూవీ

OTT Movie : ఫ్యామిలీనీ వేధించే పిల్ల దెయ్యం… గుండె ధైర్యం ఉన్నవాళ్ళు చూడాల్సిన హారర్ మూవీ
Advertisement

OTT Movie : భయపెడుతూ ఎంటర్టైన్ చేసే మూవీస్ ఏమైనా ఉన్నాయంటే అవి హర్రర్ మూవీస్ మాత్రమే. ఈ మూవీస్ లో అశ్లీలత తక్కువగా ఉండి భయపెట్టే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సినిమాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయి. అటువంటి ఒక మూవీ థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ (Netflix)

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక ఇండోనేషియన్ మూవీ. ఒక కుటుంబానికి ఒక పాప నుంచి అనుకోని ప్రమాదం ఎదురవుతుంది. ఆ కుటుంబం ఆ పాప చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. మూవీ పేరు “ఆర్ ఓ హెచ్” (ROH) ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ  ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.

స్టోరీ లోకి వెళితే

Advertisement

ఒక అడవిలో ఒంటరిగా తల్లితో పాటు ఇద్దరు పిల్లలు నివసిస్తూ ఉంటారు. అబ్బాయి పేరు హేలన్,అమ్మాయి పేరు ఆశ. వీరుంటున్న చోటికి ఒక చిన్న అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చాలా విచిత్రం గా ఉంటూ ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటుంది. ఆ అమ్మాయికి వీళ్ళు ఆహారం ఇస్తారు. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి గొంతు కోసుకొని చచ్చిపోతూ, వచ్చే పున్నమి రోజు మీ కుటుంబం అంతా చచ్చిపోతారు అంటూ తను చచ్చిపోతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని ఆ తల్లి పిల్లలతో చెప్తుంది. ఈ వూహించని ఘటనతో భయపడిన ఆ పిల్లల తల్లి ఒక మంత్రగత్తే దగ్గరికి వెళుతుంది. ఆమె ఇదంతా ఒక సైతాన్ పని అని చెప్పి పూజలు చేస్తుంది. ఆ తర్వాత అడవిలో ఒక వ్యక్తి ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను అంటూ మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు. ఈ కుటుంబం మాకు ఏమీ తెలియదని చెప్తారు.

ఆ మరుసటి రోజు బయటకు వెళ్ళిన ఆశ కనపడకుండా పోతుంది. ఎక్కడికి వెళ్ళిందో అని ఆ తల్లి భయపడుతూ వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఆ చిన్న పాప గొంతు కోసుకున్న కత్తి హెలెన్ కి దొరుకుతుంది. అంతలోనే ఆ పాప దయ్యం రూపంలో ఆ పిల్లవాడిని వెంటాడుతుంది. చివరికి ఆ దయ్యం చేతిలో ఈ కుటుంబం ఏమైంది? ఇంతకీ వీళ్లింటికి వచ్చిన పాప ఎవరు? ఆ మంత్రగత్తే వీళ్ళకు సాయపడగలిగిందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఆర్ ఓ హెచ్” (ROH) అనే ఈ మూవీని తప్పకుండా చూడండి. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇస్టపడే మూవీ లవర్స్ కి ఇదొక బెస్ట్ మూవీ. గుండె ధైర్యం ఉన్నవాళ్ళే ఈ మూవీని చూడాలి, ఎందుకంటే అప్పుడప్పుడూ వచ్చే విజువల్స్ కి పై ప్రాణాలు పైకే పోతాయి.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×