BigTV English

American Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సైన్స్ ప్రపంచంపై మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపంచబోతున్నాయి?

American Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సైన్స్ ప్రపంచంపై మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపంచబోతున్నాయి?

US Presidential Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతున్నాయి. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొన్నది. ఈ ఫలితాలు అమెరికన్ ప్రజాస్వామ్యానికి మాత్రమే కాకుండా, ప్రపంచ శాస్త్రీయ సమాజానికి కూడా కీలకంగా మారబోతున్నాయి. ఇద్దరు అభ్యర్థులు పూర్తిగా భిన్నమైన అజెండాలను ప్రదర్శించడంతో  రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ విజ్ఞాన విధానాన్ని గణనీయంగా ప్రభావితం చేయబోతున్నాయి.


హ్యారీస్ విజయం సాధిస్తే?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధిస్తే, జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన సైన్స్ ప్రాధాన్యతలను మరింత విస్తరించే అవకాశం ఉంది. వాతావరణ మార్పులపై కీలక చర్యలు చేపట్టనున్నారు. పరిశోధన కోసం అవసరమైన నిధులను, మెరుగైన అంతర్జాతీయ సహకారాన్ని అందించే అవకాశం ఉంది. హారిస్ ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సును పెంపొందించడంలో సైన్స్, టెక్నాలజీ పాత్రను గుర్తించి, దానికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.  ఆమె విధానాలు వాతావరణం, పునరుత్పాదక ఇంధనం, ఆవిష్కరణలలో ప్రగతిశీల కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఆమె నాయకత్వంలో, పారిస్ ఒప్పందం లాంటి అంతర్జాతీయ ఒప్పందాలకు,  క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌ లో మరిన్ని పెట్టుబడులకు అమెరికా కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నారు. మరోవైపు  సహజ వాయువును ఫ్రాకింగ్ చేయడాన్ని నిషేధించదని కూడా ఆమె చెప్పారు. ఈ నిర్ణయం పర్యావరణవేత్తలు అంతగా రిసీస్ చేసుకోలేకపోతున్నారు.


ఆరోగ్యం, సాంకేతికత, పర్యావరణంపై ఫోకస్

మరోవైపు, ఆరోగ్యం, సాంకేతికత, పర్యావరణంలో చారిత్రాత్మ పురోగతి సాధించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH), నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (NSF) వంటి కీలకమైన ఏజెన్సీల కోసం బడ్జెట్‌లను హారిస్ పెంచే అవకాశం కనిపిస్తోంది. అటు బైడెన్ పాలనలో భారత్ అమెరికాతో కలిసి చంద్రుడిపై అన్వేషణ కోసం ప్రతిష్టాత్మకమైన ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఓ భారతీయ వ్యోమగామి ఇప్పటికే అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నాడు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే?

బైడెన్ పాలనకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించినట్లు ట్రంప్ గత పాలన సూచిస్తోంది. ట్రంప్ తాజా ఎన్నికల ప్రచారం ఫెడరల్ పరిశోధనా సంస్థలను పునర్నిర్మించేలా ప్రణాళికలు ప్రకటించారు. ఇందులో కొన్ని ఏజెన్సీలను ఏకీకృతం చేసే అవకాశాన్ని ఆయన తెర మీదికి తీసుకొచ్చారు. మరికొన్ని ఏజెన్సీలను తొలగించనున్నట్లు తెలిపారు.  ట్రంప్ నిర్ణయం ప్రాథమిక పరిశోధనలను అస్థిరపరుస్తాయని, ఆవిష్కరణలకు మద్దతు ఇచ్చే వ్యవస్థకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ట్రంప్ గత పాలనలో NIH, NSF బడ్జెట్‌ లో కోత విధించారు. ప్రస్తుత ప్రచారంలో శిలాజ ఇంధన ఉత్పత్తికి మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయం వాతావరణ మార్పుల ఉపశమన వ్యూహాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు పలువురు నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ విజయం సాధిస్తే, ఆయన కేబినెట్ లో టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలోన్ మస్క్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే అంతరిక్ష పరిశోధనలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

మరోవైపు  క్లైమేట్ సైన్స్‌ పై ట్రంప్, హారిస్ విధానాలు పూర్తి విరుద్ధంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకించి  ట్రంప్ పాలనలో సైన్స్ ఆధారిత విధానంలో రాజీ పడే అవకాశం ఉందంటున్నారు.  అంతేకాదు, సైన్స్‌ లో అంతర్జాతీయ సహకారం కూడా ప్రమాదంలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానం ప్రపంచ పరిశోధనా సంస్థలతో సహకారాన్ని తగ్గించడానికి దారితీసే అవకాశం ఉంటుంది. హారిస్ పరస్పర శాస్త్రీయ పురోగతికి మద్దతు ఇచ్చే భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు, 82 మంది నోబెల్ గ్రహీతలు హారిస్‌ కు మద్దతు పలకడం విశేషం.

Read Also: అమెరికా అధ్యక్ష ఎన్నికలు..  ఎలక్షన్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే?

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×