BigTV English

Patan Devi Temple :- పటాన్ దేవికి భయపడ్డ మొఘల్ చక్రవర్తి

Patan Devi Temple :- పటాన్ దేవికి భయపడ్డ మొఘల్ చక్రవర్తి

Patan Devi Temple :- వేల ఏళ్ల చరిత్ర మన దేశంపై గతంలో ఎంతో మంది విదేశీ మూకలు దండెత్తాయి. విలువైన సంపదను దోచుకుపోయాయి. హిందూ సంస్కృతిని నాశనం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తుల హిందూ ఆలయాలను ధ్వంసం చేయబడ్డాయి. మరికొన్నింటిని నాశనం చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.


మొఘల్ చక్రవర్తుల కాలంలో దాడుల రక్షించబడటమే కాదు వారితోనే అభివృద్ధి చేయించబడ్డ ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి బీహార్ పటాన్ దేవి ఆలయం

ఈ ఆలయాన్ని గమనిస్తే గుడి నిర్మాణం అంతా అద్భుతంగా కనిపిస్తుంది. గుడి ఆకృతి ఊహకి అందని విధంగా ఉంటుంది. ఉత్తర భారతీయ నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. అమ్మవారి విగ్రహంతోపాటు ఆలయ సముదాయంలో గణేశుడు, ఆంజనేయుడు, శివుడు వంటి ఇతర దేవతలు కూడా ఉన్నారు. మనదేశంలోని 51 శక్తి పీఠాలలో పటాన్ దేవి ఆలయం కూడా ఒకటి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు.


దుర్గాదేవికి అంకితం చేయబడిన ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దంలో గుప్త రాజవంశీయులు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. 17వ శతాబ్దంలో మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ పునరుద్ధరించారు. ఈ ఆలయం అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయాన్ని నాశనం చేయాలనుకుని వ్యూహం రచించాడు.

ఆ మరుసటి రోజే రాజు కలలో దేవత కనిపించింది. ఆలయానికి హాని చేయవద్దని హెచ్చరించిందట. దీంతో మొఘల్ చక్రవర్తి ఈ ఆలయం జోలికి వెళ్లలేదు. అంతే కాదు ఆలయ సముదాయాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించాడు కూడా. ఇదంతా అమ్మవారి మహిమేనని భక్తుల నమ్మకం.

ఈ ఆలయంలో దుర్గమాతకి పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట. అదృష్టం కలిసి వస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాదు అనేక మొండి రోగాలు అమ్మవారి దర్శనం తొలగిపోతాయని నమ్ముతుంటారు. . ఆలయ పురాణాల ప్రకారం ఇక్కడ చెరువు సమీపంలో పాములు కనిపిస్తాయని, వాటిని చూడటం శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×