BigTV English

Pournami Pooja : పుష్య పౌర్ణమి రోజు గజలక్ష్మి వ్రతం చేయాలా….

Pournami Pooja : పుష్య పౌర్ణమి రోజు గజలక్ష్మి వ్రతం చేయాలా….

Pournami Pooja : జనవరి 6 పుష్య పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి అంటే శనికి ఇష్టమైన రోజు. పుష్యమాసమంటేనే శనిభగవానుడికి ఇష్టమైన మాసం. ఈ పర్వదినాన చంద్రునితో పాటు లక్ష్మీనారాయణుడిని పూజించాలి.ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయడం , పారాయణం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి.


ఈ పుష్య పూర్ణిమను శాకంబరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇవాళ నాలుగు శుభయోగాలు కలుగుతాయి. ఈ రోజున తెల్లవారజామునే లేచి గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.ఉతికిన బట్టలు వేసుకుని ఉపవాస వ్రతం ఆరంభించిన అనంతరం సింధూరం, ఎర్రని దారం, పసుపు రంగు పువ్వులు, పండ్లు, తీపి పదార్థాలు, పంచామృతాలతో లక్ష్మీ నారాయణులను పూజించాలి. శ్రీహరి భజన చేయాలి.

గురువారం రోజు పుష్య పూర్ణిమ వచ్చింది. ఇవాళ నవగ్రహాలయానికి వెళ్లి ఉదయం పూజ చేయాలి. శనిదేవునికి నువ్వుల నూనె సమర్పించాలి. అలా తైలాభిషేకం చేస్తే వారి జీవితాంతం శనిబాధలు తొలగిపోతాయి. ఉప్పు రాసిన జమ్మి ఆకులు ఉంచి నమస్కరించాలి. గుప్పెడు నల్ల నువ్వులను శనిగ్రహం వద్ద ఉంచాలి. ఈరోజు చేసే పూజతో మరు జన్మల్లోను సంపద, శాంతి, శ్రేయస్సును పొందుతారు. గజలక్ష్మీని పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుంది. ఇదే రోజున రాత్రి గజలక్ష్మీ మాతను స్మరిస్తూ ఓం శ్రీ హ్రీ క్లీం గజ లక్ష్మియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవాలి. పుష్య పూర్ణిమ రోజున అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్ముల పూజ చేయాలి. లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి.


శ్రీ హరి భజన కీర్తనలను జపించాలి. సాయంత్రం పాలలో పంచదార, వండిన అన్నం కలిపి చంద్రునికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజ చేయడం వల్ల ఇంట్లోనే లక్ష్మీ నివసిస్తుందని పెద్దలు చెబుతారు. పుష్య పూర్ణిమ రోజున రాత్రి సమయంలో దక్షిణవర్తి శంఖంలో గంగాజలం, కుంకుమ కలిపి శ్రీ హరి విష్ణువుకు అభిషేకం చేయాలి. ఇదే రోజున చీమలకు పిండిలో పంచదార కలిపి తినిపించడం వల్ల చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం కలుగుతుంది.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×