Big Stories

Rahu Kaala Pooja : రాహుకాలంలో పూజలు వెనుక అనుమానాలు

Rahu Kaala Pooja

Rahu Kaala Pooja : మనకు రోజులో వారంతో వచ్చే దుర్మూహర్తం, నక్షత్రంతో వచ్చే దుర్మూహర్తం , తిథితో వచ్చే గండ కాలం, యమగుళికా కాలం , నక్షత్రంలో చివరి సమయంలో వచ్చే వర్జ్యము , అలాగే రాహు కాలం ఉంటాయి. అయితే ప్రాంత బేధాన్ని ఆచారాలు మారుతుంటాయి. తిరుపతిలో రాహు కాలాన్ని అందరూ పాటిస్తుంటారు. రాయలసీమ జిల్లాలతోపాటు తమిళనాడు బోర్డర్ లో రాహు కాలంలో ముహూర్తాలు పెట్టుకోరు. పూజలు చేయరు.

- Advertisement -

తెలంగాణ ప్రాంతంలో వర్జ్యాన్ని ప్రధానంగా చూస్తారు. కోస్తాలోని కృష్ణాలాంటి జిల్లాల్లో దుర్మూహర్తాన్ని పట్టించుకుంటారు.యమగండ కాలాన్ని పట్టించుకుంటారు. అయితే దీంట్లో అన్నింటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. కాలము , యమగండం, వర్జ్యము ఇలా అన్నీ పాటించి చేయాలనుకుంటే ఇక చేయడానికి ఆరోజులో ఏమీ ఉండదన్న భావన ఉంది. తెలుగురాష్ట్రాల్లో రాహు కాలానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పద్దతి, ఆచారంలో ఉందో అలా కొనసాగించడంలో తప్పు లేదు.

- Advertisement -

అయితే రాహుకాలంలో చేయాల్సిన పనులు తెలుసుకోవాలి. దుర్గాదేవికి రాహు కాలంలోపూజ ప్రీతికరమైనది. రాహుకాల సమయాన శుక్రవారం నాడు నిమ్మకాయ దొన్నెలో దీపారాధన చేస్తే అమ్మవారికి ప్రీతి అని తాంత్రిక గ్రంధాల్లోచెప్పడం జరిగింది. వాటి కోసమే మాత్రమే రాహుకాలాన్ని వాడుతుంటారు. అన్నింటికి రాహుకాలంలో పూజలు చేయరు.

జాతకభాగంలో రాహుదోష గోచారరిత్యా చెడు ప్రభావం అధికమే ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, మానసికరోగాలు.మెదడు, నరాలకు సంబంధించిన అనారోగ్య బాధల నివారణకు రాహుకాలంలో దుర్గమ్మని తలచుకొని పూజ చేస్తే తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయని కొందరి నమ్మకం

రాహుకాల సమయం :
సోమవారం – ఉ 7:30 -9:00
మంగళవారం – మ 3:00 -4:30
బుధవారం – మ 12.00 – 1:30
గురువారం – మ 1:30 – 3:00
శుక్రవారం – ఉ 10:30 – 12:00
శనివారం – ఉ 9:00 – 10:30
ఆదివారం – సా 4:30 – 6:00

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News