BigTV English

Samsung: శామ్‌సంగ్ బంపర్ ఆఫర్లు.. ఈ సేల్ మళ్లీరాదు..!

Samsung: శామ్‌సంగ్ బంపర్ ఆఫర్లు.. ఈ సేల్ మళ్లీరాదు..!

Samsung: కొత్త ఏడాదిలో సేల్స్ పెంచుకునేందుకు ప్రముఖ సంస్థలు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఇ-కామర్స్ సంస్థలు ఇప్పటికే ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్‌సంగ్ అదిరిపోయే సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్’ను అనౌన్స్ చేసింది. ఈ డీల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై ఏకంగా 50 శాతానికి పైగా డిస్కౌంట్లను అందిస్తోంది.


దీంతోపాటు టాబ్లెట్లు, యాక్సెసరీస్, ఇతర ప్రొడక్ట్స్‌పై బంపరాఫర్లు ఉన్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, శామ్‌సంగ్ షాప్ యాప్, కంపెనీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో ఈ ఆఫర్లు లభిస్తున్నాయి. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.25వేల వరకు అంటే 22.5 శాతం క్యాష్‌బ్యాక్‌ సైతం పొందొచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్లపై బంపరాఫర్లు..


ఈ సేల్‌లో గెలాక్సీ A సిరీస్, M సిరీస్, F సిరీస్, S సిరీస్, Z సిరీస్ మోడళ్లపై 57 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తుంది. గెలాక్సీ S24 సిరీస్‌ను ప్రీ-బుకింగ్ చేసే వారు స్పెషల్ ఆఫర్లు కూడా పొందవచ్చునని తెలిపింది. గెలాక్సీ S21FE, S23, S23FE, గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ Z ఫ్లిప్ 5, గెలాక్సీ A15 5G, A34 5G, A54 5G, A25 5G, గెలాక్సీ M34, M14, గెలాక్సీ F34, F14, M04 వంటి స్మార్ట్‌ఫోన్లపై బంపరాఫర్లు ఉన్నాయి.

టీవీలపై బంపర్ ఆఫర్లు..

శామ్‌సంగ్ ప్రీమియం, లైఫ్‌స్టైల్ టీవీ మోడళ్లపై రూ.15,250 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ టీవీల ధరలపై 48 శాతం వరకు డిస్కౌంట్‌తో పొందొచ్చు. నియో క్యూఎల్‌ఈడీ, QLED టీవీలను కొనుగోలు చేసేవారు స్పెషల్ గిఫ్ట్స్ కూడా అందుకుంటారు. వీరికి రూ.1,24,990 విలువైన శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా లేదా రూ.69,990 విలువైన 50-అంగుళాల Serif TV లేదా రూ.38,990 విలువైన సౌండ్‌బార్.. వీటిలో ఏదో ఒకటి గిఫ్ట్‌గా లభిస్తుంది.

ల్యాప్‌టాప్స్‌పై ఆఫర్లు..

గెలాక్సీ బుక్ గో, గెలాక్సీ బుక్ 3, గెలాక్సీ బుక్ 3 ప్రో వంటి మోడళ్లపై 46 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

వేరబుల్ డివైజ్‌లు, ట్యాబ్‌లపై ఆఫర్లు..

టాబ్లెట్లు, వేరబుల్ డివైజ్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్లు పొందొచ్చు. గెలాక్సీ ట్యాబ్ A9+, గెలాక్సీ ట్యాబ్ S9 FE, గెలాక్సీ ట్యాబ్ S9, ట్యాబ్ S9 FE+ వంటి టాబ్లెట్లపై ఆఫర్లు వర్తిస్తాయి. దీంతోపాటు గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ LTE 47mm, గెలాక్సీ వాచ్ 6 బ్లూటూత్ 43mm, గెలాక్సీ బడ్స్ 2 Pro 7, గెలాక్సీ బడ్స్ 2 వంటి వేరబుల్ డివైజ్‌లపై కూడా ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×