E-Paper
Advertisement

‘రావు బహదూర్’ని లేపడానికి వంగా తాపత్రయం… వర్కవుట్ అవుతుందా బాసూ?

‘రావు బహదూర్’ని లేపడానికి వంగా తాపత్రయం… వర్కవుట్ అవుతుందా బాసూ?
Advertisement

Rao Bahadur:కేరాఫ్ కంచరపాలెం.. చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఈ సినిమాని తీసిన దర్శకుడు వెంకటేష్ మహాని ఆకాశంలోకి ఎత్తేసారు అంతా .ఇంకేం ఇలాంటి డైరెక్టర్ నుంచి మరిన్ని క్లాసిక్ ఫిలిమ్స్ వస్తాయని ఆశగా ఎదురుచూశారు జనాలు.ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే మరో రీమేక్ తెరకెక్కించాడు వెంకటేష్ మహా.

ఈ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నా వెంకటేష్ మహా కి మంచి పేరు తెచ్చింది.ఇక దాని తర్వాత మర్మాణువు అని మరో సినిమాని క్రౌడ్ పండింగ్ తో  తెరగకెక్కించాలని ప్లాన్ చేశాడు.అది అంతగా వర్కౌట్ అవకపోవడంతో ఆ కథ ఇదేనా లేక మరొకటో తెలీదు కానీ సత్యదేవతోరావు బహుదూర్ అనే మరో సినిమాని పట్టాలెక్కించాడు వెంకటేష్ మహా.

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ ఉండటంతో

ఇక దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ ఉండటంతో అంచనాలు ఆకాశానికి తాకాయి.వదిలిన అప్డేట్స్,  రిలీజ్ అయిన ట్రైలర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.ఇక అప్పుడు ఇప్పుడు అంటూ ఎట్టకేలకి ఈ జూలై మూడున థియేటర్లోకి వచ్చేసింది.కానీ సినిమా మాత్రం ఆడియన్స్ ని అలరించలేకపోయింది .

Advertisement

మొత్తానికి బహదూర్ గారు బాక్సాఫీస్ వద్ద చాప చుట్టేశారు.ఎప్పటిలాగే సత్యదేవ్ నటన సూపర్ అని ఆకాశానికి ఎత్తేశారు.కానీ కలెక్షన్ల దగ్గరికి వచ్చేసరికి థియేటర్లో ఈగలు తోలుకోవాల్సి వచ్చింది.ఇక తాజాగా లెనిన్ ఇచ్చిన షాక్ కి ఈ సినిమాని ఆల్మోస్ట్ మర్చిపోయారు కూడా.అయితే సినిమా  థియేటర్ లో  ప్లాప్ అయినా వెనకాల మహేష్ బాబు బ్రాండ్ ఉండటంతో నెట్ ఫిక్స్  భారీ రేటుకే దక్కించుకుంది.

సినిమాని ప్రమోట్ చేయాలని గుర్తొచ్చిందో ఏమో

ఇక మహేష్ బాబు పేరు పుణ్యాన ఓవర్సీస్ బిజినెస్ కూడా గట్టిగానే జరుపుకుంది.ఫలితంగా సినిమాకి పెట్టిన బడ్జెట్ నిర్మాతల జేబులోకి వచ్చేసింది .కానీ థియేటర్లలో నాలుగు డబ్బులు చూద్దాం అనుకున్న బయ్యర్ల పరిస్థితి అటు ఇటు కాకుండా పోయింది.ఇప్పుడు థియేటర్లో నుంచి వెళ్లిపోయాక సినిమాని ప్రమోట్ చేయాలని గుర్తొచ్చిందో ఏమో సెలెబ్రెటీల చేత వరుసగా పోస్ట్లు పెట్టిస్తున్నట్టు కనిపిస్తుంది మూవీ టీమ్ .

ఈ క్రమంలోనే ఎంట్రీ ఇచ్చిన ఎంట్రీ ఇచ్చాడు సందీప్ వంగ .రావడమే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఖచ్చితంగా మూడు గంటలు కేటాయించాలి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చేశాడు.నిజానికి సినిమాలో అంతో ఇంతో కంటెంట్ ఉంటే గానీ నోరు విప్పని వంగ ఈ సినిమాని మెచ్చుకోవడం విశేషం.కానీ ఆల్రెడీ థియేటర్లలో నుండి సినిమా చాప చుట్టేశాక కూడా మళ్లీ ప్రత్యేకంగా మూడు గంటలు కేటాయించండి అని వంగా కండిషన్ కండిషన్ పెట్టడమే ఇక్కడ కాస్త కామెడీగా ఉంది.మరోవైపు డైరెక్టర్ కమ్ యాక్టర్ రాహుల్ రవీందర్ కూడా సినిమాని ఆకాశం లోకి ఎతేస్తున్నాడు.

రైటింగ్ అద్భుతం, అమోఘం అంటూ ఒక రేంజ్ లో భజన చేయడం మొదలెట్టాడు.కానీ సినిమా థియేటర్ల నుంచి ఆల్మోస్ట్ వెళ్లిపోయాక ఇప్పుడు వీళ్ళు  చేస్తున్న భజన సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందో  మేకర్స్ కే తెలియాలి. చూడాలి మరి కనీసం ఈ పుషింగ్ ఓటిటిలో స్ట్రీమింగ్  అయ్యేటప్పుడు అయినా వ్యూస్ పెంచుకోవడానికి పనికొస్తుందో లేదో!

also read :పోసాని భార్యను రోజూ బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఆ రోజూల్లో ‘గురూజీ’ పడ్డ కష్టాలు ఇవే!

Related News

ఒకప్పుడు ఛాన్సుల కోసం.. ఇప్పుడు డేట్ల కోసం! కిరణ్ అబ్బవరం రేంజ్ మామూలుగా లేదుగా!

వారణాసిపై ప్రియాంక చోప్రా బిగ్ అప్డేట్.. 14 నెలలుగా అదే పని అంటూ!

RGV: సెన్సార్ బోర్డుపై రాంగోపాల్ వర్మ సంచలన పోస్ట్..!

పోసాని భార్యను రోజూ బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఆ రోజూల్లో ‘గురూజీ’ పడ్డ కష్టాలు ఇవే!

హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ నోట్ పంచుకున్న అన్నా!

సునయన ప్రేమ, పెళ్లిలో ఇన్ని ట్విస్టులా..ఈమె భర్త బ్యాక్ గ్రౌండ్ చూసారా?

దళపతి విజయ్ ఆఖరి వేట: ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ లాక్ ?

Big Stories

Advertisement
×