E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్లలో ‘రిమూవబుల్ బ్యాటరీలు’ ఎందుకు మాయమయ్యాయి? అసలు రహస్యం ఇదే!

స్మార్ట్‌ఫోన్లలో ‘రిమూవబుల్ బ్యాటరీలు’ ఎందుకు మాయమయ్యాయి? అసలు రహస్యం ఇదే!
Advertisement

Removable Battery: ఒకప్పుడు మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయినా, ఛార్జింగ్ త్వరగా అయిపోతున్నా.. వెంటనే బ్యాటరీని బయటకు తీసి మళ్లీ పెట్టేవాళ్లం. అవసరమైతే మార్కెట్లో దొరికే కొత్త బ్యాటరీని కొని సులభంగా మార్చుకునే వీలుండేది. కానీ ప్రస్తుత అధునాతన స్మార్ట్‌ఫోన్లలో ఆ సౌకర్యం లేదు. బ్యాటరీ పాడైతే సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిందే తప్ప సొంతంగా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. అసలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఈ ‘రిమూవబుల్ బ్యాటరీ’లను ఎందుకు తీసేశాయి? దీని వెనుక ఉన్న బలమైన కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం.

స్లిమ్, ప్రీమియం డిజైన్

ప్రస్తుత రోజుల్లో మెుబైల్ లవర్స్ మెుబైల్ ఫీచర్లతో పాటు.. స్లిమ్ డిజైన్ కు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు ఒకప్పటి ప్లాస్టిక్ బాడీ స్థానంలో మెటల్, గ్లాస్ బాడీలతో కూడిన ప్రీమియం డిజైన్లు ప్రస్తుతం మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఒకవేళ వాటిలో రిమూవబుల్ బ్యాటరీని అమర్చాలంటే ఫోన్‌కు ప్లాస్టిక్ బ్యాక్ కవర్ తప్పనిసరి. అంతేకాకుండా బ్యాటరీ చుట్టూ అదనపు ప్రొటెక్టివ్ కేసింగ్ ఉండాలి. దీనివల్ల ఫోన్ లావుగా, బరువుగా మారొచ్చు. అదే నాన్-రిమూవబుల్ బ్యాటరీ అయితే ఫోన్ లోపల ఖాళీ స్థలాన్ని సమర్థవంతంగా వాడుకుని స్లిమ్ డిజైన్‌ను రూపొందించడానికి వీలవుతుంది.

వాటర్, డస్ట్ రెసిస్టెన్స్

Advertisement

ఒకప్పుడు ఫోన్ తడిచినా, నీళ్లల్లో పడినా త్వరగా పాడయ్యేవి. కానీ ప్రస్తుత ఫోన్లలో అలాంటి సమస్య ఉండటం లేదు. ఎందుకంటే ఫోన్‌ బ్యాక్ ప్యానెల్ సులభంగా తీసేలా ఉంటే దాని సందుల గుండా నీరు, ధూళి సులభంగా లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి ఫోన్‌ను పూర్తిగా సీల్ చేయడం ద్వారా మాత్రమే వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ (IP68 రేటింగ్) ఇవ్వడం కంపెనీలకు సాధ్యమవుతుంది. ఇందుకోసమే తయారీదారులు వెనుక భాగం విడిపోకుండా గట్టిగా సీల్ చేస్తున్నారు.

పెరిగిన బ్యాటరీ సామర్థ్యం

పాత తరం బ్యాటరీలు చతురస్రంగా లేదా దీర్ఘచతురస్రంగా మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుత బ్యాటరీలను ఫోన్‌లోని ఖాళీ స్థలానికి అనుగుణంగా ఏ ఆకారంలోనైనా అడ్జస్ట్ చేసుకునేలా డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల ఫోన్ సైజు పెరగకుండానే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలను ఫిక్స్ చేయగల్గుతున్నారు. పైగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా ఇది ఎంతగానో సాయపడుతోంది.

Advertisement

Also Read: పవర్‌ఫుల్ బ్యాటరీ, మతిపోయే AI ఫీచర్లు.. రూ.30 వేలలో మోస్ట్ వాంటెడ్ ఫోన్స్!

వ్యాపార వ్యూహం కూడా..

పైన పేర్కొన్న సాంకేతిక కారణాలతో పాటు వ్యాపార వ్యూహాం కూడా ఇందులో దాగుంది. ఒకప్పుడు బ్యాటరీ పాడైతే కేవలం రూ. 300 లేదా రూ. 500 ఖర్చుతో కొత్తది కొని ఫోన్‌ను మరో రెండేళ్లు వాడేవారు. కానీ ఇప్పుడు బ్యాటరీ మార్చడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో వినియోగదారులు పాత ఫోన్ స్థానంలో కొత్త ఫోన్ కొనడానికే మొగ్గు చూపుతున్నారు. ఇది కంపెనీల అమ్మకాలను పెంచుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: ఛార్జింగ్ తిప్పలు లేని స్మార్ట్‌వాచ్‌లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. వారాల పాటు తిరుగుండదు!

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×