BigTV English

Sashtanga Namaskaram : స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదంటే..!

Sashtanga Namaskaram : స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదంటే..!

Sashtanga Namaskaram : దేవాలయాలకు వెళ్ళినప్పుడో, లేదా ఇంట్లో వ్రతాలు కానీ, పూజలు కానీ జరిగినప్పుడు గురువులకు,దేవుళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. పురుషులు సాస్టాంగ నమస్కారం చేయచ్చు కానీ.. మహిళలు చేయకూడదన్న నియమం ఉంది. సాష్టాంగం అంటే శరీరంలో ఎనిమిది అంగాలను వక్షస్థలము, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు కళ్లు భూమిపై ఆన్చి నమస్కరించడం. మనిషిఈ ఎనిమిది అంగాలతోనే తప్పులు చేస్తుంటాడు. అందులే సాష్టాంగ నమస్కారం చేస్తే పాపాలు తొలగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.


కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుందనే ధర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు. మన శాస్త్రాల్లో స్త్రీకి గొప్ప విలువ ఉంటుంది. సృష్టికి ఆధారమైన, పోషణకు ఆధారమైన స్థలం నేలకి తాకకూడదనే ఉద్దేశంతో స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు అనే నియమం పెట్టారు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలోఉండే గర్భకోశానికి నష్టం జరగకుండా ఉండేందుకే పెద్దలు ఈ ఆచారం పెట్టారు. అందుకే ఇతి హాసాల్లో కూడా ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి మాత్రమే నమస్కారం చేయాలని చెప్పారు. ఇంకా చేయగలిగితే నడుం వంచి చేయడంలో తప్పులేదు. ఆ రకంగా ప్రార్ధించవచ్చు.

మగవాళ్లు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు కూడా గుడికి, ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభానికి వెనుక చేయాలి . నమస్కారం చేసేటప్పుడు చాతి నేలకు తగలాలి. శిరస్సుతో నమస్కారం అంటే శిరస్సు నేలకి తగలాలి. అలాగే నుదురు కూడా నేలకు ఆనించాలి. దృష్టితో అనగా కళ్లు మూసుకుని ఏ దేవుడ్ని తలచుకుంటున్నామో..ఆ మూర్తిని చూడగలగాలి. కరాబ్య నమస్కారం అంటే రెండు చేతులు నేలకు తాకించి తలను వంచి నమస్కారం చేయాలి.


Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×