BigTV English

Anaganaga Oka Raju : గోదావరి స్టైల్‌లో దసరా విషెస్… నవీన్ పోలిశెట్టి ఫన్నీ వీడియో వైరల్

Anaganaga Oka Raju : గోదావరి స్టైల్‌లో దసరా విషెస్… నవీన్ పోలిశెట్టి ఫన్నీ వీడియో వైరల్

Anaganaga Oka Raju : సంక్రాంతికి సినిమాకి వెళ్లడం అనేది తెలుగు ప్రేక్షకులకు ఒక ఆనవాయితీ. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు వాళ్ల సినిమా సంక్రాంతి సీజనలు రిలీజ్ చేయడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రతి సంక్రాంతికి తన బ్యానర్ నుంచి ఒక సినిమా వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంటారు.


ఈ ఏడాది సంక్రాంతికి కూడా గేమ్ చేంజర్, సినిమాతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా విడుదల చేశారు. గేమ్ చేంజర్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్లు తీసుకువచ్చింది. ఈ సంక్రాంతికి కూడా చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. అందులో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు చిత్రం కూడా ఒకటి.

గోదావరి స్టైల్ లో దసరా విషెస్ 

నవీన్ పోలిశెట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నవీన్ హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. నవీన్ పోలిశెట్టి సినిమా అంటే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అనే నమ్మకాన్ని సాధించుకున్నాడు.


నవీన్ హీరోగా చేస్తున్న అనగనగా ఒక రాజు సినిమా వాస్తవానికి ఎప్పుడో విడుదల కావలసి ఉంది. నవీన్ కి ఒక యాక్సిడెంట్ జరగడం దాని వలన సినిమా లేట్ అవ్వడం జరిగింది. మొత్తానికి ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. నేడు దసరా సందర్భంగా గోదావరి స్టైల్ లో నవీన్ పోలిశెట్టి గోదావరి పీపుల్ తో కలిసి విషెస్ చెప్పారు.

వీడియోలో ఏముంది?

నవీన్ పోలిశెట్టి సైకిల్ నడిపించుకుంటూ వస్తాడు, ఇంతలో ఒక ఆవిడొచ్చి ఏంటండీ దసరా బుల్లోడులా మెరిసిపోతున్నారు అని అడుగుతుంది. మరి పండక్కి మన సినిమా వస్తుంది కదా అక్క ఆ మాత్రం గ్లామర్ ఉండొద్దా అంటూ అడుగుతాడు నవీన్. మన సినిమా పేరు ఏంటో తెలుసా అని నవీన్ ప్రశ్నిస్తూ అందరితో అనగనగా ఒక రాజు అని ఒకసారి గా చెప్పించాడు.

సంక్రాంతి పండుగకి ఫ్యామిలీస్ అందరూ వచ్చేయండి అని నవీన్ చెబితే, ఇంతలో ఒకాయన పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ తో పాటు కలిసి వచ్చేస్తాం అని చెప్పడం హైలైట్. బాబాయ్ కి రెండు టిక్కెట్లు ఎక్స్ట్రా అని నవీన్ పోలిశెట్టి లాస్ట్ పంచ్ హైలెట్. మొత్తానికి ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని అందరికీ ఒక నమ్మకం వచ్చేసింది.

Also Read: MSVPG : చాలా ఏళ్ల తర్వాత ఉదిత్ నారాయణ వాయిస్… మెగాస్టార్ పాటలో మ్యాజిక్ రిపీట్

Related News

Samantha: పండగపూట గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. విడాకుల తరువాత ఇలా!

Ravi Teja : సంక్రాంతి బరిలో రవితేజ సినిమా… స్పెయిన్ షెడ్యూల్‌తో ఫైనల్ టచ్

Kanatara 1 – Prabhas:  కాంతార1 కు కల్కి రివ్యూ.. మరింత హైప్ ఇచ్చాడుగా!

Kantara 1 Remuneration:  కాంతార1 రిషబ్ నుంచి రుక్మిణి వరకు రెమ్యూనరేషన్ .. ఎవరికి ఎంతంటే?

MSVPG : చాలా ఏళ్ల తర్వాత ఉదిత్ నారాయణ వాయిస్… మెగాస్టార్ పాటలో మ్యాజిక్ రిపీట్

Little Hearts 2 : లిటిల్ హార్ట్స్ 2 ప్రకటించిన డైరెక్టర్.. హీరో హీరోయిన్లు మారిపోయారా?

Rahul Ramakrishna: కేటీఆర్, కేసీఆర్ మీరే రావాలి.. నన్ను చంపేయండి, రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్!

Big Stories

×