BigTV English

Kantara 1 Remuneration:  కాంతార1 రిషబ్ నుంచి రుక్మిణి వరకు రెమ్యూనరేషన్ .. ఎవరికి ఎంతంటే?

Kantara 1 Remuneration:  కాంతార1 రిషబ్ నుంచి రుక్మిణి వరకు రెమ్యూనరేషన్ .. ఎవరికి ఎంతంటే?

Kantara 1 Remuneration: కన్నడ స్టార్ డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా తెరకెక్కిన ఈ సినిమా పై విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పడ్డాయి. ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా 2022వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమాకు ఫ్రీక్వల్ సినిమాగా విడుదలైన సంగతి తెలిసిందే. కాంతార సినిమా కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.


రూ.125 కోట్ల బడ్జెట్ తో కాంతార ప్రీక్వెల్

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమాకు ప్రీక్వెల్ చిత్రంగా కాంతార1 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇక ఈ సినిమా కోసం సుమారు  రూ. 125 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించగా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ పాత్రలో నటించారు. అదేవిధంగా జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి వారు సైతం కీలక పాత్రలలో నటించారు.  ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన నటీ నటుల రెమ్యూనరేషన్(Remuneration) కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా లాభాలలో వాటా

కాంతార సినిమా కోసం రిషబ్ శెట్టి కేవలం 4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు కానీ ప్రీక్వెల్ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా లాభాలలో వాటాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి సైతం ఈ సినిమా లాభాలలో వాటా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రిషబ్ శెట్టి కాకుండా ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటుల రెమ్యూనరేషన్ విషయానికి వస్తే..


కనకావతిగా మెప్పించిన రుక్మిణి

రుక్మిణి వసంత్ ఈ సినిమా కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమాలో ఈమె కనకావతి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రుక్మిణితో పాటు సంయుక్త గౌడ,జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి వారు కూడా ఈ సినిమా కోసం ఒక్కొక్కరు కోటి రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.   ప్రస్తుతం ఈ సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. ఇక కాంతార 1 మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు మరిన్ని భాగాలు కూడా రాబోతున్నాయి. అంటూ రిషబ్ కాంతార యూనివర్స్ గురించి వెల్లడించారు.

Also Read: Jayammu Nischayammuraa: నాగ చైతన్య శోభిత మధ్య గొడవలు.. మాట్లాడడం లేదంటూ!

Related News

Samantha: పండగపూట గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. విడాకుల తరువాత ఇలా!

Ravi Teja : సంక్రాంతి బరిలో రవితేజ సినిమా… స్పెయిన్ షెడ్యూల్‌తో ఫైనల్ టచ్

Kanatara 1 – Prabhas:  కాంతార1 కు కల్కి రివ్యూ.. మరింత హైప్ ఇచ్చాడుగా!

Anaganaga Oka Raju : గోదావరి స్టైల్‌లో దసరా విషెస్… నవీన్ పోలిశెట్టి ఫన్నీ వీడియో వైరల్

MSVPG : చాలా ఏళ్ల తర్వాత ఉదిత్ నారాయణ వాయిస్… మెగాస్టార్ పాటలో మ్యాజిక్ రిపీట్

Little Hearts 2 : లిటిల్ హార్ట్స్ 2 ప్రకటించిన డైరెక్టర్.. హీరో హీరోయిన్లు మారిపోయారా?

Rahul Ramakrishna: కేటీఆర్, కేసీఆర్ మీరే రావాలి.. నన్ను చంపేయండి, రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్!

Big Stories

×