E-Paper
Advertisement

Tea and Coffee After Eating: భోజనం చేశాక టీ, కాఫీ తాగితే ఏమవుతుంది?

Tea and Coffee After Eating: భోజనం చేశాక టీ, కాఫీ తాగితే ఏమవుతుంది?
Advertisement

Tea and Coffee After Eating: సాధారణంగా అనేకమంది ఆహారం తిన్న తర్వాత టీ, కాఫీ తాగుతారు. భోజనం చేశాక నిద్ర వస్తుందని దాన్ని తప్పించుకునేందుకు టీ, కాఫీలను తాగుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా భోజనం చేశాక కాఫీ, టీ తాగడం వల్ల మనం తినే ఆహారంలో ఉండే ఐరన్‌ను మన శరీరం గ్రహించలేదు. దీంతో ఐరన్ లోపం సమస్య ఏర్పడుతుంది. ఇది క్రమంగా రక్తహీనతకు దారితీస్తుంది. అయితే భోజనం చేశాక తాగాలనిపిస్తే సి విటమిన్‌ అధికంగా ఉండే నారింజ, టమాటా, ద్రాక్ష రసాలను తాగితే మంచిది. దీనివల్ల శరీరం ఐరన్ బాగా గ్రహిస్తుంది. భోజనం చేశాక 100 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ సీను తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను నాలుగు రేట్లు అధికంగా వినియోగించుకుంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత టీ కాఫీలకు బదులు విటమిన్ సి ఉండే జ్యూస్‌లను తాగితే మంచిది. ఒకవేళ భోజనం చేశాక టీ, కాఫీ తాగాల్సి వస్తే కనీసం రెండు గంటల వరకైనా వేచిఉండాలని నిపుణులు అంటున్నారు. భోజనం చేసిన వెంటనే తాగితే శరీరం ఐరన్‌ను తీసుకోలేదు. అందుకే భోజనం చేశాక కాఫీ, టీ లను తాగకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఇక విటమిన్ సి విషయానికి వస్తే నిమ్మ, కివి, ద్రాక్ష, బొప్పాయి లాంటి పండ్లలో ఇది అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రసాలను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×