Big Stories

Ayyappa : బుధవారం రోజునే అయ్యప్పను పూజించాలా..?

Ayyappa : శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. ఎముకలు కొరికే చలిలో చన్నీటి స్నానం, పలుచటి నల్ల వస్త్రాలతో కటిక నేల మీద శయనం , మాట జారకుండా మాటిమాటికి అయ్యప్పను తలుచుకోవడం , శత్రువులోను స్వామిని దర్శించుకునే గొప్ప గుణం అయ్యప్ప భక్తులకే సొంతం.

- Advertisement -

బుధవారం వినాయకుడితో పాటు అయ్యప్ప స్వామి కి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహించి స్వామి వారిని వేడుకుంటారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలలు ధరించిన భక్తులు ఎంతో కఠిన నియమాలను పాటిస్తూ స్వామి వారి సేవలో ఉంటారు. ప్రతి రోజు నిత్య పూజలతో, భజన సేవలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు.

- Advertisement -

దీక్షధారుడు తాను స్వయంగా స్వామిగా మారి అయ్యప్పస్వామిని అర్చించడం ఇక్కడ ఉద్దేశం. తనలో, ఎదుటివాడిలో ఉన్న పరమాత్మను గుర్తించి, తనను తాను సంస్కరించుకోవడం దీక్ష ద్వారా కలిగే ప్రయోజనం.

అయ్యప్ప మాలలు ధరించి దీక్షలతో ఉన్న భక్తుల మకర సంక్రాంతి రోజున పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఇంతటి గొప్ప మహిమలు కలిగిన అయ్యప్ప స్వామిని బుధవారం పూట పూజించడం ద్వారా సకల సంతోషాల తో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News