IND VS SA: టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య ఈ నెలలో టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తున్న టీమిండియా.. అక్కడ టి20 లో పూర్తికాగానే టెస్ట్ సిరీస్ కు సిద్ధం కానుంది. నవంబర్ 14వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టును ప్రకటన చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). ఈ మేరకు అధికారిక పోస్ట్ కూడా పెట్టింది బీసీసీఐ. అయితే ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో రిషబ్ పంత్ ( Rishabh Pant) రీ – ఎంట్రీ ఇస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ గా శుభమాన్ గిల్ ( Shubman Gill) కొనసాగుతున్నాడు. ఈసారి కూడా మహమ్మద్ షమీకి ( Mohammed Shami ) బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నవంబర్ 14వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్ల మధ్య కేవలం రెండు టెస్టులు మాత్రమే జరగనున్నాయి. నవంబర్ 14వ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా కలకత్తాలో మొదటి టెస్ట్ టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు ఆడుతాయి. ఇక రెండో టెస్టు నవంబర్ 22వ తేదీ నుంచి గౌహతి వేదికగా జరుగనుంది. ఈ టెస్టులు భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఒక రోజులో 90 ఓవర్ల మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ టీమిండియా జట్టులో మరోసారి మహమ్మద్ షమీకి నిరాశే ఎదురైంది. రంజీ మ్యాచ్ లలో ఒక్క ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొడుతూ దుమ్ము లేపుతున్న మహమ్మద్ షమీని పక్కకు పెడుతూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో జరిగిన రంజీ ట్రోఫీలో మూడు మ్యాచ్ లలో ఏకంగా 15 వికెట్లు పడగొట్టి దుమ్ము లేపాడు మహమ్మద్ షమీ. అయినా అతనికి ఛాన్స్ దక్కలేదు. దీంతో మహమ్మద్ షమీ కెరీర్ ముగిసినట్లే అని క్రికెట్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక అటు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. అతను పూర్తిగా రికవరీ అయి తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే టెస్టు సిరీస్ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ కొనసాగుతాడు.
టీమిండియా సభ్యులు: శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్) (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
🚨 INDIA'S SQUAD FOR TEST SERIES Vs SOUTH AFRICA 🚨
Shubman Gill (C), Rishabh (WK) (VC), Jaiswal, KL Rahul, Sudharsan, Padikkal, Dhruv Jurel, Jadeja, Sundar, Jasprit Bumrah, Axar Patel, Nitish Kumar Reddy, Siraj, Kuldeep, Akash Deep. pic.twitter.com/JVDu56QlUS
— Tanuj (@ImTanujSingh) November 5, 2025