Big Stories

Temple : దేవాలయానికి వెళ్లినప్పుడు కొంత సేపు కూర్చుని రావాలా?

Temple : స్థిర చిత్తంతో ఐహికత్వాన్ని మరిచి, మౌన ధ్యానంతో కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతం. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అనికాదు. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఆలయ ప్రవేశానికి కొన్ని నియమాలున్నాయి. ఆలయంలో ప్రవేశించబోయే ముందు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అంతస్థులు, హోదాలు , పలుకుబడిని గుడిలో ప్రదర్శించరాదు. దేవునికి ధనవంతుడూ దరిద్రుడు ఒక్కటేనన్న విషయం మరిచిపోకూడదు. పూజారికి లంచమిచ్చి ఆధిక్య ప్రదర్శన చేయకూడదు.

- Advertisement -

దైవకార్యాలకు అందరూ పెద్దలే. దైవ ప్ర్రీతికి అందరూ ప్రీతిపాత్రులే. దైవపూజకు అందరూ అర్హులే. దైవదర్శనానికి అందరూ సమానులే. దేవుడు శ్రీమంతుల ఇంటి మనిషి కాదు. దేవుడు అధికారుల ఆస్థి కాదు. దేవుడు ప్రజాసేవకుల సొత్తు కాదు. దేవుని ముందు ఆధిక్యతను ప్రదర్శిస్తే దైవనిందతో సమానమే. ఆలయానికి వెళ్లి అరగంట సేపైనా కూర్చుని ధ్యానించాలి. అర్పణా భావమే దేవునికిచ్చే గొప్పకానుక.

- Advertisement -

దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక శరీరం, మనస్సు రెండూ ఉత్తేజిమవుతాయి.దానికి కారణం భగవంతుని మహిమో, మంత్రోచ్ఛారణలు మాత్రమే కాదు. ఆలయ నిర్మాణశైలి కూడా ఒక ప్రధానమైన కారణం. దేవాలయాలు శక్తి కేంద్రాలు. మంత్రోచ్ఛారణల్లోని శబ్ధతరంగాల వల్ల మనసు చెడు ఆలోచనల వైపు మరలనివ్వద్దు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. గుడిలో జపంకానీ, ధ్యానం చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది.

పూలదండలకు, కొబ్బరికాయ, అరటి పండ్లు, కానుకలకు దేవుడు సంతోషించడు. దేవునికి కావాల్సింది నీ మనస్సు, నీ ప్రేమ, నీ ఆరాధన.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News