Kamal Hassan -Rajinikanth కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రజనీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamal Hassan) ప్రస్తుతం కెరియర్ పట్ల పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన పరవాలేదు అనిపించుకుంది. ఇక కమల్ హాసన్ చివరిగా థగ్ లైఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పూర్తి నిరాశపరిచిన సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడంతో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి కానీ అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. కమల్ హాసన్ నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో రజనీకాంత్ 173 వ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ సుందర్ సి(Sunder C) దర్శకత్వం వహించబోతున్నారు.
కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థను ప్రారంభించి 44 ఏళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాని నిర్మించబోతున్నారని ఇలా రజనీకాంత్ 173 వ సినిమాని నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమా ద్వారా ఐదు దశాబ్దల మా స్నేహ బంధాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నామని, ఇది ప్రస్తుత జనరేషన్ కు ఎంత స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని తెలిపారు.ఈ సినిమాను 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు కూడా వెల్లడించారు. ఈ విధంగా కమల్ హాసన్ రజనీకాంత్ కాంబోలో సినిమా రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
காற்றாய் மழையாய் நதியாய்
பொழிவோம் மகிழ்வோம் வாழ்வோம்!ராஜ்கமல் பிலிம்ஸ் இண்டர்நேசனல் தயாரிப்பில் சுந்தர்.சி இயக்கத்தில் இனிய நண்பர் சூப்பர் ஸ்டார் ரஜினிகாந்த் நடிக்கும் #Thalaivar173 #Pongal2027 @rajinikanth#SundarC#Mahendran@RKFI @turmericmediaTM pic.twitter.com/wBT5OAG4Au
— Kamal Haasan (@ikamalhaasan) November 5, 2025
ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి తదుపరి విషయాలను వెల్లడించనున్నారు. ఇక రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2(Jailer 2) సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ జైలర్ సినిమాలో నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయిన తరువాత రజనీకాంత్ సుందర్ సి దర్శకత్వంలో బిజీ కాబోతున్నారు. నిజానికి కూలి సినిమా తరువాత రజనీకాంత్ తిరిగి లోకేష్ కనగ రాజ్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ, కూలి సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడం అలాగే లోకేష్ రజినీకాంత్ గారికి యాక్షన్ సినిమాని నేరేట్ చేయడంతో ఆ సినిమా నచ్చని రజినీకాంత్ కమల్ నిర్మాణంలో సుందర్ డైరెక్షన్ లోని సినిమాకు కమిట్ అయ్యారు.
Also Read: Balakrishna: ఫ్యాన్స్ కి షాక్ … ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసిన బాలయ్య!