Road Accident: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఓ బైక్ పై ముగ్గురు వ్యక్తులు జమ్మి చేడు ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచుసుకుంది. ఈ ప్రమాదంలో డివైడర్‌ను బలంగా ఢీ కొట్టి ఎగిరిపడడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచరంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సమీసంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు నాగరాజు, నరేష్ గా గుర్తించారు. అత వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.