Akhanda 2 Update: బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఇది సహజంగానే జరుగుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూడు సినిమాలు కూడా అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన వీడియో కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంది.
బోయపాటి శ్రీను ఎన్ని సినిమాలు చేసినా కూడా, బాలకృష్ణతో సినిమా చేయటం అతనికి ప్రత్యేకం. మరోవైపు బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేసినా కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయటం బాలయ్య అభిమానులకు ప్రత్యేకం. ఎందుకంటే బాలకృష్ణ ని ఎలా చూపించాలో పరిపూర్ణంగా తెలిసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను అని బలంగా నమ్ముతుంటారు బాలయ్య అభిమానులు.
అఖండ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు తమన్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది. తమన్ సంగీతానికి మంచి హై వచ్చింది. చాలామంది అప్పటి నుంచే నందమూరి తమన్ అని పిలవడం కూడా మొదలుపెట్టారు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేశాడు తమన్.
ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాకి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. ఇదివరకే రిలీజ్ అయిన రెండు వీడియోస్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తమన్ మార్క్ కనిపించింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సిద్ధం అయిపోయింది. నవంబర్ 7న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ ఫస్ట్ సింగిల్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
కొంతమంది అర్చన చేసే పండితులను తీసుకొచ్చి తమన్ ఈ పాటను పాటించాడు. తమన్ పాడించిన తర్వాత వాళ్లు బయటకు వచ్చి పాడిన శ్లోకాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే బాగా పాపులర్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ లో అవి వినిపించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాలో ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మరోసారి చూపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఈ రోజే రిలీజ్ అని అప్పట్లో చెప్పారు. కానీ అది వాయిదా పడింది. అఖండ పనుల్లో పడి తమన్ రాజా సాబ్ సినిమాను పక్కన పెట్టేసాడా అని డౌట్స్ కూడా కొంతమందికి వస్తున్నాయి.
Also Read: Pawan Kalyan: స్టైలిష్ పొలిటీషియన్, ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే ఈ లుక్స్?