Saraswati Devi Lakshmi Devi : మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్న అవి ధరించినప్పుడు మాత్రమే అందాన్ని ఇస్తాయి. విద్య అనే ఆభరణం మనిషికి సదా ఆభరణంగా ఉండే కీర్తిని గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ధనవంతుడు తన ఊరికే గొప్పవాడు. విద్యావంతుడు దేశానికే గొప్పవాడు. ధనంతో ఫలం కొనగలం కానీ ఫలితాన్ని కొనలేం!
లక్ష్మీ దేవి సరస్వతి కి అత్తగారు అవుతుంది కదా! అత్తగారి అధికారం ఎంతటిడైన కోడలి అధికారం తక్కువదేమీ కాదు. ధనం ఏ కారణంగానైనా తగ్గిపోవచ్చు. విజ్ఞానం నానాటికీ పెరగడమే కానీ తరిగిపోవడం ఉండదు. ధనాన్ని దాయాదులు భాగం పొందవచ్చు. విద్యను ఎవరు భాగం పంచుకోలేరు, ఎవరు దొంగతనం చేయలేరు. ఏనుగు ఎంత పెద్దది అయినా తొండం చిన్నదైనా దేని విలువ దానిదే .
ఎవరైనా భార్యను కొనగలరు. కానీ తల్లిని మాత్రం కొనలేరు. అయినా అజ్ఞానవంతులున్నచోట సరస్వతి ఉండదు. అందుకే సరస్వతీ మందిరాలు, సరస్వతీ ఆలయాలకు మనకు లేవు. విద్యావంతుల హృదయమే సరస్వతి మందిరం. ఆమెకు అదే తగిన స్థలం. .