Hyderabad Development: హైదరాబాద్.. భాగ్యనగరం.. లక్షలాది మందికి బతుకునిస్తున్న నగరం.. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు ఏదో పని మీద వస్తుంటారు. ఎంతో మందికి ఉపాధిని కల్పించే భాగ్యనగరం అభివృద్ధి గురించి జూబ్లీహిల్స్ బైపోల్ వేళ డెవలప్‌మెంట్‌లో ఎవరి పాత్ర ఎంత అనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. భాగ్యనగరాన్ని డెవలప్ చేసింది తామే అని ఎవరెన్ని చెప్పుకున్నా.. ఈ నగరాన్ని మాత్రం విశ్వనగరంగా తీర్చిన ఘనత మాత్రం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.
లక్షలాది ఉద్యోగాలను కల్పించిన కాంగ్రెస్
ఈ మహానగరానికి ముహమ్మద్ కులీ కుతుబ్ షా పునాది రాయి వేస్తే, కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందుకు నడిపింది. పిల్లల ఎదుగుదలలో తల్లి పడే తపన, తండ్రి పడే కష్టం ఎంత ఉంటుందో, హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కష్టం, తపన అంతేవుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు, వాటికి అనుబంధంగా వచ్చిన వేలాది సంస్థలు లక్షలాది ఉద్యోగాలను కల్పించాయి. అంతెందుకు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను నెహ్రు, ఇందిరా గాంధీ ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరాభివృద్ధికి బాటలు వేశారు.
వీటి వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా…
హైదరాబాద్ అనగానే ఇప్పుడు చాలామంది ఐటీ సిటీ అంటారు. కానీ నిజానికి ఈ నగరానికి బలం ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలే. కాంగ్రెస్ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహరావు హైదరాబాద్ విస్తరణకు, అభివృద్ధికి పునాది వేశారు. వారి దూరదృష్టితోనే నగరంలో దాదాపు వంద ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. వీటివల్లే హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL), భారత్ డైనమిక్స్ (BDL), మిధానీ, డీఆర్‌డీవో, సీసీఎంబీ, ఐఐసీటీ, హెచ్‌ఎల్‌ఎల్, హిందుస్తాన్ మిషన్ టూల్స్, సీసీఎల్ వంటి సంస్థలు హైదరాబాద్ గౌరవాన్ని పెంచి నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపాయి.
వేలాది ఐటీ కంపెనీలు…
ఈ సంస్థల ద్వారా లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు పొందారు. ఈ సంస్థలతో అనుబంధంగా ప్రైవేట్ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటై సేవా రంగాలు కూడా అభివృద్ధి చెందాయి. వీటి చుట్టూ కాలనీలు, స్కూల్లు, మార్కెట్లు ఏర్పడి హైదరాబాద్ నగరం నలుదిక్కులా విస్తరించింది. దీంతో మన హైదరాబాద్ పరిశ్రమల నగరంగా, ఉద్యోగాల కేంద్రంగా, ఆర్థిక శక్తిగా మారింది. లక్షలాది ఉద్యోగాలకు జీవనాధారంగా మారింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలే మన నగర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేశాయి. తద్వారా మన దేశంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
కీలక సంస్థలు దేశానికి దిక్సూచి..
రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన బీహెచ్ఈఎల్ విద్యుత్ రంగానికి వెలుగులు నింపింది. కంచన్‌బాగ్‌లోని బీడీఎల్, మిధానీ, డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్ దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచాయి. హబ్సిగూడలోని సీసీఎంబీ, తార్నాకలో ఐఐసీటీ సంస్థలు విజ్ఞాన శాస్త్రానికి కేంద్రం అయ్యాయి. చర్లపల్లిలో హెచ్ఎంటీ, భానూరులోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఏఎస్ రావు నగర్‌లో ఈసీఐఎల్, ఉప్పల్‌లో ఎన్‌జీఆర్ఐ, మసాబ్‌ట్యాంక్‌లో ఎన్ఎంఈసీ నగర ఖ్యాతిని పెంచాయి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను, ఐటీ హబ్‌లను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసి హైదరాబాద్ అభివృద్ధికి, ఉద్యోగాల సృష్టికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కృషి చేశాయి.
జూబ్లీహిల్స్‌లో కేంద్ర సంస్థల ఘనత కాంగ్రెస్‌దే..
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. చిన్న మధ్య తరహ పరిశ్రమల జాతీయ పరిశోధన, శిక్షణ సంస్థ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడలో ఏర్పాటైంది. 1960లో ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఈ సంస్థ ఇక్కడ ఏరి కోరి ఏర్పాటు చేశారు. దీని వల్ల చుట్టు పక్కల ఎన్నో చిన్న మధ్య తరహ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
జూబ్లీహిల్స్ గల్లీల్లోకి మెట్రో
కేంద్రీయ విద్యుత్ శిక్షణా సంస్థ కూడా అదే ఏడాది ఏర్పాటు చేశారు. అప్పట్లో దేశంలో ఎక్కువగా కరెంటు లేదు. అయితే ఇంటింటికి విద్యుత్ సరఫరా చేయాలన్న సంకల్పంతో నెహ్రు యూసుఫ్ గూడలో కేంద్రీయ విద్యుత్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించారు. దీంతో దేశ మంతటా వెలుగులు నిండాయి. నెహ్రు దార్శనికతను కొనసాగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ గల్లీల్లోకి మెట్రో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది నేటి తరానికి కూడా తెలిసిన విషయం. ఇప్పుడు మెట్రో విస్తరిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే. ఓఆర్ఆర్ నిర్మించిది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నిర్మిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. ఫ్యూచర్ సిటీ కడుతున్నదీ కాంగ్రెస్ పార్టీనే. మూసీకి పునరుజ్జీవం కల్పిస్తున్నదీ కాంగ్రెస్ పార్టీనే.
కాంగ్రెస్‌తోనే భాగ్యనగర అభివృద్ధి..
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఐటీ, ఫార్మా, సేవల రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ విశ్వనగరంగా తీర్చిదిద్దాయి. ప్రారంభ దశలో ప్రభుత్వ రంగ సంస్థలతోనే హైదరాబాద్ బలపడిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అనంతరం పరిస్థితుల్లో ఐటీ ఇతరత్రా రంగాల్లో వృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలు పునాది వేసి ముందుకు నడిపాయి. హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు ఇప్పుడు అందుతున్న మౌలిక వసతులు అన్నీ కూడా కాంగ్రెస్ తెచ్చినవే కావడం గమనార్హం.
ALSO READ: Jubilee Hills bypoll: కేటీఆర్ హైడ్రా పాలిటిక్స్.. బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించక తప్పదా..?