E-Paper
Advertisement

Double Door : సింహద్వారానికి రెండు తలుపులు ఉండాలా..

Double Door : సింహద్వారానికి రెండు తలుపులు ఉండాలా..
Advertisement

Double Door : ఏ ఇంటికైనా సింహద్వారం కీలకం. అపార్ట్ మెంట్ కల్చర్ బాగా జనంలోకి వచ్చినప్పటి నుంచి సింగిల్ డోర్ సింహద్వారాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇంటి ముఖ ద్వారానికి సింగిల్ డోర్ ను కొందరు… రెండు తలుపులు ఉండే విధంగా మరికొందరు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఏది కరెక్ట్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు. పూర్వం రోజుల్లో ఇల్లు, కోటలు, ఆలయాలు ఇలా ఏది చూసినా రెండు ద్వారాలే కనిపించేవి. ఎక్కడా సింగిల్ డోర్ అనేది ఉండదు,

కాని పెద్దలు సూచించిన ప్రకారం చూస్తే సింహద్వారానికి మాత్రం సింగిల్ తలుపు ఉండేలా పెట్టుకోవడం సరికాదంటోంది. రెండు తలుపుల సింహద్వారాలే ఉండాలంటోంది. రెండు కవాటాలు ఉంటేనే శోభయమానంగా ఉంటుంది. ఇద్దరు వేర్వేరు ప్రాంతాలకు చెంది, వేర్వేరు గోత్రాలు, వేర్వేరు పరిస్థితుల నుంచి వచ్చిన ఇద్దరు కలిసి ఉండే చోటు కాబట్టి రెండుడోర్లు ఒక విధంగా తెరుచుకోవడం జరిగితే వారి జీవితం సాఫీగా సాగిపోతుందని శాస్త్రం చెబుతోంది. రెండు డోర్లు ఉంటే అవి తెరుచుకోవడానికి తక్కువ స్థలం తీసుకుంటాయి. ఇదే సింగిల్ డోర్ విషయానికి వస్తే ఎక్కువ స్థలం ఆక్యుపై చేస్తాయి.

Advertisement

అదే ఆ గుమ్మం బాగా పెద్దదైతే సింగిల్ డోర్ ఉంటే అది బాగా ఎక్కువ స్థలం తీసుకుంటుంది. మూడు అడుగులు వెడల్పున్న సింగిల్ డోర్ ను ఉపయోగిస్తే అది ఎక్కువ స్పెస్ తీసుకోవడం వల్ల మిగిలిన వస్తువులు సర్దుకోవడం కూడా కష్టమే. మరోకటి ఏంటంటే అంత పెద్ద తలుపు తెరిస్తే పక్కన ఒక కిటీకి మూతపడే పరిస్థితి ఉంటుంది. శాస్త్రం ప్రకారం రెండు తలుపులు ఉన్న గుమ్మమే రాజయోగం కలిగిస్తుంది. సింగిల్ డోర్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. గృహనిర్మాణం చేసేటప్పుడు ఈవిషయాలను గుర్తించుకోవాలి. అలాగే గడపతో ఉన్న గుమ్మాలు ఉండేలా సింహద్వారాలు ఉండేలా చూసుకోవడం శాస్త్రం రిత్యా ఆమోదయోగ్యం.

ముఖ్యంగా గడప ఉండే గుమ్మాలు ఉంటే రెండు తలుపులు ఉండాలని శాస్త్ర నియమం. గడప లేని వాటి విషయంలో లెక్క వేరే విధంగా ఉంటుంది.
గుమ్మంతో రెండు తలుపులు ఉన్నదే పరిపూర్ణమైన ద్వారం అవుతుందనేది శాస్త్ర ప్రమాణం. ఇంటికి ఇలా డబుల్ డోర్లు ఉండటం వల్ల వాటి వైబ్రేషన్ మరో విధంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×