E-Paper
Advertisement

Brahma Chari (celibate) : బ్రహ్మచారిగా ఉండకూడదా…

Brahma Chari (celibate) : బ్రహ్మచారిగా ఉండకూడదా…
Advertisement

Brahma Chari (celibate) : ఏ దేశంలో ఉన్నా ఏ ఖండంలో ఉన్నా ఏ మతంలో అయినా అన్ని పెళ్లి కామన్. సన్యాసం స్వీకరించి వారి సంగతిని పక్కన పెడితే మిగిలిన వారంతా పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటారు. మళ్లీ పెళ్లికాని వారి సంగతేంటి.. పెళ్లి చేసుకునే ఆలోచనకు కొంతమంది దూరంగా ఉంటారు. పెళ్లి పేరు చెబితేనే బాబోయ్ ఆ జంఝాటం మాకొద్దు సో బెటరే సో బెటరు అని డైలాగులు చెబుతుంటారు. మరికొందరికి పెళ్లి చేసుకుందామనుకున్నా కొన్ని సమస్యల వల్ల అవివాహితుడిగా మిగిలిపోతుంటారు. ఈ రోజుల్లో సహజీవనం పేరుతో పెళ్లి తప్ప అన్నీ చేసుకుంటున్నారు. ఏది ఎలా ఉన్నా పెళ్లి చేసుకోని బ్యాచ్ లర్స్ మాత్రం ఈ జీవితమే బాగుందని గడిపేస్తుంటారు.

Advertisement

కానీ శాస్త్రం ప్రకారం ప్రతీ ఆడ, మగ పెళ్లి చేసుకుని పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే రుణ విముక్తి కలుగుతుందని చెబుతోంది . పెళ్లి చేసుకోకుంటే ఎన్ని జన్మలెత్తినా ఆ రుణాలు తీరవంట. మనిషి భూమి మీద పుట్టినప్పుడు మూడు రుణాలతో పుడతాడు. రుషి రుణం, దేవరుణం, పితృ రుణం తీర్చుకోవాలని శాస్త్రం చెబుతోంది. బ్రహ్మచర్యం చేసినప్పుడే రుషి రుణం తీరుతుందని. పురాణాలను తెలుసుకుని తన తర్వాత తరాల వారికి చెప్పాలి. అపుడే రుషి రుణం తీరుతుంది.

Advertisement

యజ్ఞాలు, యాగాలు చేయించడం లేదా చేయడం వల్ల దేవరుణం తీర్చుకోవచ్చు. దేవతలు తృప్తి చెందేలా యజ్ఞాలు చేయాలి. అప్పుడే సమయానికి వర్షాలు పడతాయి. పంటలు పండుతాయి. గాలి, నీరు, వెలుతురు, ఆహారం ఇస్తున్న దేవుడి రుణాన్ని తీర్చుకోవాలి. లేకపోతే మనిషి జన్మ ఎత్తినందుకు సార్ధకత ఉండదు. పితృరుణాన్ని మనం తీర్చుకోవాలి. అమ్మా నాన్న ప్రత్యక్షదైవాలు . వంశాన్ని కొన్నిసాగించాలంటే సంతానం ఉండాలి. కొడుకో , కూతురో ఎవరైనా సంతానాన్ని పొందడం ద్వారా మనకి జన్మనిచ్చిన వారి వంశాన్ని ఆగపోకుండా చూడాలి. అప్పుడే పితృ రుణం తీరుతుంది. సంతానం కావాలంటే పెళ్లి చేసుకోవాలి. బ్రహ్మచారిగా ఉండిపోతే వారికి పితృరుణం నుంచి విముక్తి కలగదు. యజ్ఞాలు, యాగాలు చేయాలన్న వివాహితులే అర్హులు. జంట కూర్చుని పూజలు చేయడానికి మాత్రమే అర్హులు అవుతారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×