BigTV English

Monks: సన్యాసుల చేతుల్లో కర్ర వెనుక ఉద్దేశం అదేనా?

Monks: సన్యాసుల చేతుల్లో కర్ర వెనుక ఉద్దేశం అదేనా?

వైరాగ్యానికి, తాత్వికానికి, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా పొడవైన కర్రను పట్టుకోవడం మనం చూస్తుంటాం. వై ఆకారంలో పద్దెనిమిది అంగుళాల యోగదండం అనే దండాన్ని, కమండలాన్నీ ఉండేవారిని మాత్రమే తాపసులు అంటారు.రుషులు అని కూడా అంటారు . గాలి,నీరు , భూమి, ఆకాశం, అగ్ని అనే పంచబూతాల సమ్మేళనమే మనిషి కాబట్టే ఐదు అడుగుల పొడవైన చేతి కర్రను ధరిస్తుంటారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అని మూడు విధాలు ఉన్నాయి. ఒకే ఒక కర్రను ధరించే వారు ఉండేవారుంటారు. వారందరిది అద్వైత సిద్ధాంతం అంటారు. అంటే జీవుడు ఒక్కడే అని బలంగా నమ్మేవారు. శ్రీ శంకరాచార్యాడి మతం పాటించేవారు. మనిషిలోనే దేవుడున్నాడని…పరబ్రహ్మత్వమే మనిషిని నడిపిస్తోందని నమ్మేవారు.


స్వర్గం, నరకం అనేవి రెండూ భూమ్మీదే ఉన్నాయి. అంతరాత్మకు విరుద్ధంగా దైవత్వాన్ని పక్కన పెట్టి అక్రమ మార్గల్లో వెళ్తే ఆ పాప ఫలతాల్ని ఏదో ఒక రూపంలో అనుభవించాల్సి ఉంటుందని అద్వైతం చెబుతోంది. ఈ అద్వైతం సిద్దాంతం పాటించే వారి దగ్గర ఒకే ఒక కర్ర ఉంటుంది. జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి ఈ కర్రను సేకరిస్తుంటారు.

రెండు కర్రలను కలిపి ఒక్కటిగా గట్టి చేత్తో పట్టుకుని బోధనలు చేసే వారు ద్వైత సిద్దాంతం నమ్మేవారు. వీరి ద్విదండి అంటారు. దేవుడు వేరు జీవుడ వేరని బోధిస్తారు. వైష్ణవ భక్తులంతా వీరే. ఈ సిద్దాంతాన్నే భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునిడి ఉపదేశించాడు. ద్వైత సిద్ధాంతానికి ఉన్న ప్రాచుర్యం అద్వైతానికి అంతగా లేదు. రామానుజుచార్యులు లాంటి వారెందరో ఈ మతానికి ప్రాణం పోసి ప్రతిష్ట పెంచారు.వీరందరిని జీయర్ అని అంటారు


మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పట్టుకునే వారిని తత్వత్రయం అంటారు. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ మూడు నారాయణ తత్వంగా భావిస్తుంటారు.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×