Zubeen Garg: ఈస్ట్ – వెస్ట్ 2025 ఫెస్టివల్ లో భాగంగా సింగపూర్ కి వెళ్ళిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) సముద్ర యానంలో స్కూబా డైవింగ్ చేస్తూ అనూహ్యంగా సముద్రంలో పడిపోయారు. వెంటనే ఆయనను దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించినా ఫలితం లేకపోయింది. అయితే ఆయన మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు నిన్నటి వరకు వార్తలు రాగా.. ఇప్పుడు వారిపై ఏకంగా హత్య కేసు నమోదు చేయడం పలు సంచలనం సృష్టిస్తోంది.
విషయంలోకి వెళ్తే.. ఈ కేసుకు సంబంధించి జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ , ఉత్సవ నిర్వహకుడు శ్యామ్ కాను మహంతాపై అస్సాం పోలీసులు హత్య అభియోగం మోపారు. వీరిద్దరిని బుధవారం ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేసి గౌహతికి తరలించారు. కోర్టు వీరిని 14 రోజులపాటు కస్టడీకి పంపింది. దర్యాప్తులో భాగంగా ఎఫ్ఐఆర్లో బీఎన్ఎస్ సెక్షన్ 103 నీ జోడించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నార్త్ ఆడియన్స్ ఆ ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు హత్యకు పాల్పడడం వెనుక అసలు కారణం ఏంటి? అంటూ కూడా ఆరా తీస్తున్నారు.
Also read:Bigg Boss 9 Promo: నడుము గిల్లారంటున్న ఇమ్మానుయేల్.. ఇదెక్కడి గొడవ రా బాబు!