BigTV English

<strong>Purpose of Earlobe Holes</strong> : చెవులు కుట్టించుకునే ఆచారం ఇలా మొదలైంది

<strong>Purpose of Earlobe Holes</strong> : చెవులు కుట్టించుకునే ఆచారం ఇలా మొదలైంది

Purpose of Earlobe Holes :మన పెద్దలు చెప్పే ఆచారాల్లో కచ్చితంగా అంతర్లీనంగా ఒక మంచి ఉంటుంది. ఒకప్పుడు ఆడపిల్లలకు చెవులు కుట్టించడం ఆచారంగా భావించే వారు. ఐదేళ్ల వయసు లోపలే ఈ పని చేయాలని అనేవారు. రాను రాను కాలం మారడంతో.. ఈ ఆచారాన్ని పాటించేవాళ్లు తగ్గిపోయారు. కాని ఇప్పుడు ఫ్యాషన్ ఆడమగా చెవులు కుట్టించుకుంటున్నారు. చెవులకి ఆభరణాలు అందాన్ని ఇస్తాయి కూడా.


చెవులు కుట్టించుకునే ఆచారాన్ని ఎందుకు పెట్టారో తెలుసా..దాని వల్ల ఎన్నో లాభాలున్నాయి.ఒకప్పుడు చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయబద్దంగా జరిపేవాళ్లు. కొంతమంది మగవాళ్ళు కూడా కుట్టించుకునే వాళ్ళు. ఆడవాళ్ళకి ఎక్కువగా చిన్నప్పుడే చెవులు కుట్టించే కార్యక్రమం చేస్తారు.. చెవులు కుట్టించడం ఆచారం, ఫ్యాషన్ కాకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. చెవులు కుట్టించుకున్న వాళ్ల ముఖల్లో కళ పెరుగుతుంది.

చెవులకు మన ముఖం లోని కళ్ళు, ముక్కు, పళ్లతో సంభంధం ఉంటుంది. చెవులు కుట్టడం వల్ల కళ్ళు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. చెవుల బయటవైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి.. ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. .చెవులు కుట్టించుకున్న వారిలో మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది చెవులు కుట్టించుకున్న వారికి హెర్నియా లాంటి సమస్యలు రావు.. స్త్రీలలో వచ్చే అసాధారణ రుతుక్రమ సమస్యలు కూడా రాకుండా ఉండేలా చేస్తుంది. పునరుత్పత్తిలో కూడా చెవి కుట్టించుకోవడం సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. చెవులు కుట్టడం వలన ఆ ప్రాంతంలో ఉండే అన్ని రకాల నాడులు ఉత్తేజితం అవుతాయి.


అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చెవి మధ్య ప్రాంతం రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించినది, కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లలకు చెవులు కుట్టించాలి. అయితే చెవులు కుట్టే పనిని వైద్యుడి ద్వారా చేయించాలని శాస్త్రం చెబుతోంది. ఏ స్థానంలో వేస్తే మంచిదో వారికి మాత్రమే తెలుస్తుంది. పూర్వం రోజుల్లో కంసాలలు కూడా వైద్యం చేసే వారు. అందుకే వారితోనే చెవులు కుట్టించేఆచారం ఉండేది.

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×