BigTV English

BANW Vs PAKW : బంగ్లాదేశ్ చేతిలో పాక్ ఓటమి… ఉమెన్స్ వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక ఇదే

BANW Vs PAKW : బంగ్లాదేశ్ చేతిలో పాక్ ఓటమి… ఉమెన్స్ వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక ఇదే

BANW Vs PAKW : ప్ర‌స్తుతం మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ PAKW VS BANW మ‌ధ్య కొలొంబోలోని ఆర్.ప్రేమ‌దాస మైదానంలో జ‌రిగిన‌టువంటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ జ‌ట్టు ఓట‌మి పాలైంది. దీంతో పాయింట్ల టేబుల్స్ లో రెండో స్థానానికి ఎగ‌బాకింది బంగ్లాదేశ్ జ‌ట్టు.  పాయింట్ల టేబుల్స్ లో తొలి స్థానంలో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో బంగ్లాదేశ్, మూడో స్థానంలో టీమిండియా జ‌ట్లు 2 పాయింట్ల‌తో టాప్ స్థానాల్లో కొన‌సాగుతుండ‌గా.. ఇంగ్లాండ్ సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. శ్రీలంక‌, పాకిస్తాన్, న్యూజిలాండ్ జ‌ట్లు ఒక్కో మ్యాచ్ ఆడి ఓట‌మి పాల‌వ్వ‌డంతో ఆ జ‌ట్లు వ‌రుస‌గా చివ‌రి స్థానాల్లో కొన‌సాగుతున్నాయి. న్యూజిలాండ్ ఉమెన్స్ జ‌ట్టు చివ‌రి స్థానంలో కొన‌సాగుతుండ‌టం విశేషం.


ఇలాంటి ఔట్లు వాళ్లే సాధ్యం

 పాకిస్తాన్ స్పిన్న‌ర్ నాష్రా సంధు అసాధార‌ణ‌మైన హిట్ వికెట్ ఔట్ తో పెవిలియ‌న్ కి చేరింది. వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్ ల్లో హిట్ వికెట్ అయిన మూడో పాకిస్తాన్ క్రికెట‌ర్ గా ఆమె నిలిచింది. అంత‌కు ముందు పాకిస్తాన్ మెన్స్ క్రికెట‌ర్లు మిస్బా ఉల్ హ‌క్, ఇమామ్ ఉల్ హ‌క్ ఇలాగే ఔట్ అయ్యారు. ఈ మ్యాచ్ లో రుబియా హైద‌ర్ అజేయ హాఫ్ సెంచ‌రీతో బంగ్లాదేశ్ తో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఘ‌న విజ‌యం సాధించ‌డం విశేషం.  ముఖ్యంగా 35వ ఓవ‌ర్ రెండ‌వ బంతికి పోర్నా అక్త‌ర్ వేసిన పుల్ లెంగ్త్ డెలివ‌రీనీ ఆడేందుకు నాష్రా సంధు ప్ర‌య‌త్నించింది. చివ‌రి క్ష‌ణంలో త‌న బ్యాట్ ను వెన‌క్కి తీసుకుంది. కానీ ఆమె బ్యాట్ ఫౄలోఓ త్రూ స‌మ‌యంలో అనుకోకుండా స్టంప్స్ ను త‌గిలింది. దీంతో ఆమె హిట్ వికెట్ గా ఔట్ అయింది. ఈ విచిత్ర‌మైన ఔట్ ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవ‌డం విశేషం. బంగ్లాదేవ్ బ్యాట‌ర్ రుబియా హైద‌ర్ అజేయంగా 54 ప‌రుగులు చేసి జ‌ట్టును విజ‌యప‌థంలో న‌డిపించింది. కెప్టెన్ నిగ‌ర్ సుల్తానా 23తో క‌లిసి 62 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది. దీంతో బంగ్లాదేశ్ 130 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 113 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. తొలుత బంగ్లాదేశ్ ప్రారంభ వికెట్లు కోల్పోయిన‌ప్పుడు రుబియ‌యా జాగ్ర‌త్త‌గా ఆడింది. ఇక ఆ త‌రువాత వేగంగా ప‌రుగులు చేసి.. ముఖ్యంగా 19వ ఓవ‌ర్ నాష్రా సంధు బౌలింగ్ లో అనే బౌండ‌రీలు కొట్టింది.

నెటిజ‌న్లు ట్రోలింగ్స్..

ఇక బంగ్లాదేశ్ విజ‌యంలో మారుఫా అక్త‌ర్ బౌలింగ్ లో కీల‌క పాత్ర పోషించింది. ఆమె అద్భుత‌మైన ప్రారంభ స్పెల్ తో పాకిస్తాన్ ను దెబ్బ తీసింది. తొలి ఓవ‌ర్ లోనే ఓమైమా సోహైల్, సిద్రా అమీన్ ల‌ను డ‌కౌట్ చేసి పాకిస్తాన్ 2 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయేలా చేసింది. మారుఫాతో పాటు న‌హీదా అక్త‌ర్ కూడా పాకిస్తాన్ ఇన్నింగ్స్ ను అస్థిర ప‌రిచింది. ఆమె మునీబా అలీ, ర‌మీన్ ష‌మీమ్ ల‌ను ప‌వ‌ర్ ప్లే త‌రువాత త్వ‌ర‌గానే పెవిలియ‌న్ పంపింది. దీంతో పాకిస్తాన్ కు పెద్ద భాగ‌స్వామ్యాలు ఏర్ప‌డ‌లేదు. ఈ మ్యాచ్ లో 38.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 129 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లో రాణించి ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ‌ధ్య కాలంలో పాకిస్తాన్ క్రికెట‌ర్లకే ఇలాంటి వెరైటీ విచిత్ర సంఘ‌ట‌న‌లు పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌కే సాధ్య‌మ‌ని ప‌లువురు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.  మొత్తానికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు ఏ టోర్నీ అయినా కానీ ఏదో ఒక విదంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ ఇవ్వ‌డం మాత్రం ప‌క్కా..!


Related News

Tilak Verma : సిరాజ్ లాగే… తిల‌క్ వ‌ర్మ‌కు డీఎస్పీ ప‌ద‌వి ?

Nashra Sandhu Hit Wicket: ఇండియాను అవ‌మానించింది..హిట్ వికెట్ అయి ప‌రువుతీసుకుంది… పాక్ లేడీపై ట్రోలింగ్‌

BAN W vs PAK W: కామెంట్రీలో అజాద్ కశ్మీర్ అంటూ వ్యాఖ్యలు…క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌నంటూ సనా మిర్‌ పోస్టు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మ‌ ఇంట పెళ్లి సంద‌డి..తీన్మార్ స్టెప్పులేసిన యువ‌రాజ్‌

IND VS WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే..ఉచితంగా ఇలా చూడండి !

Marcus Stoinis: బ‌ట్ట‌లు విప్పేసి బౌలింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్..వీడియో చూస్తే న‌వ్వు ఆపుకోలేరు

IND VS WI: నేటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్…అపోలో టైర్స్ జెర్సీతో టీమిండియా…జ‌ట్ల వివ‌రాలు ఇవే

Big Stories

×