BigTV English

Kantara Chapter 1: కాంతార 2 ఫస్ట్ డే కలెక్షన్స్..ఆ సినిమాలన్నీ వెనక్కే?

Kantara Chapter 1: కాంతార 2 ఫస్ట్ డే కలెక్షన్స్..ఆ సినిమాలన్నీ వెనక్కే?

Kantara Chapter 1: ప్రముఖ శాండిల్ వుడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి (Rishabh Shetty) 2022లో ‘కాంతార’ సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా, డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా ‘ కాంతార చాప్టర్ – 1’ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 700 పైగా స్క్రీన్ లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి ప్రీమియర్ షో తోనే మొదలవ్వాల్సింది. కానీ ఆక్యూపెన్సీ విషయంలో ఇబ్బందులు ఏర్పడడంతోనే నిర్మాతలు డైరెక్ట్ గా సినిమాను అక్టోబర్ 2న విడుదల చేశారు.


విడుదలకు ముందే రికార్డు సృష్టించిన కాంతార చాప్టర్ 1..

దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థగా పేరు సొంతం చేసుకున్న హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఛాలువే గౌడ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్గా నటించిగా.. జయరాం, గుల్హన్ దేవయ్య, రాకేష్ పూజారి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ అందించిన ఈ చిత్రానికి ఈ రేంజ్ గుర్తింపు రావడానికి కాంతార చిత్రం సాధించిన సంచలన విజయమే అని చెప్పవచ్చు. అటు బిజినెస్ పరంగా, కంటెంట్ పరంగా అంచనాలు పెరిగేలా చేసింది. అంతేకాదు ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.

మొదటిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసిన కాంతార చాప్టర్ 1..

ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వసూలు చేసింది అని ప్రతి ఒక్కరూ ఆరా తీయగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. కన్నడలో 18 కోట్ల రూపాయలు.. తెలుగులో 12.5 కోట్లు , హిందీలో 20 కోట్లు, తమిళంలో 5.25 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు నార్త్ అమెరికాలో కలిపి 66.2 కోట్లు వసూలు చేసిందని, మిగతా దేశాలలో కలెక్షన్స్ ఇంకా అందాల్సి ఉండగా.. మొత్తానికి 75 కోట్ల రూపాయలకంటే ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మొదటి రోజే ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే నిజంగా ప్రశంసనీయం అంటూ రిషబ్ శెట్టి డైరెక్షన్ పై కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


ఆ చిత్రాలన్నింటిని వెనక్కి నెట్టిన కాంతార చాప్టర్ 1..

ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో ఆ చిత్రాలన్నింటినీ వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది. అలా కూలీ 65 కోట్లు, ఛావా 31 కోట్లు , సికందర్ రూ.26 కోట్లు, సైయారా రూ.22 కోట్లు రాబట్టాయి.ఈ లెక్కలు ఈ చిత్రాల తొలి రోజు కలెక్షన్స్ అయితే.. ఈ కలెక్షన్స్ అన్నిటిని కూడా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 బ్రేక్ చేసింది అనడంలో సందేహం లేదు.

ALSO READ: Rahul Ramakrishna: ఏంటి రాహుల్ భయపడ్డావా?ఏకంగా అకౌంట్ డిలీట్ చేశావ్!

Related News

Rahul Ramakrishna: ఏంటి రాహుల్ భయపడ్డావా? ఏకంగా అకౌంట్ డిలీట్ చేశావ్!

Breaking: నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు!

Zubeen Garg: సింగర్ మృతి.. ఏకంగా వారందరిపై హత్య కేసు!

RGV vs RRR : ఆ మాటలతో మళ్లీ సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ

Ram Charan : ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించిన గ్లోబల్ స్టార్, లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Samantha: పండగపూట గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. విడాకుల తరువాత ఇలా!

Ravi Teja : సంక్రాంతి బరిలో రవితేజ సినిమా… స్పెయిన్ షెడ్యూల్‌తో ఫైనల్ టచ్

Big Stories

×