Mouni Roy: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అందంతోనే కాదు గ్లామర్ ఫోటోషూట్ తో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఒకవైపు సినిమాలు , మరొకవైపు వెబ్ సిరీస్ లలో అలరిస్తున్న ఈమె.. అంతకుముందు ధారావాహికలలో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా పలు బ్రాండెడ్ షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తూ వార్తలలో నిలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈ ముద్దు గుమ్మ హైదరాబాదులోని హైటెక్ సిటీలో సందడి చేసింది.
అక్టోబర్ 2న హైదరాబాదులోని హైటెక్ సిటీ వేదికగా.. కమల్ వాచ్ కో ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమల్ లైఫ్ స్టైల్ హౌస్ ను బాలీవుడ్ స్టార్ మౌని రాయ్ ఆరంభించింది. బాలీవుడ్ సినీ తార అయిన ఈమె ఈ కార్యక్రమానికి విచ్చేసి రిబ్బన్ కట్ వేడుకతో పాటు సాంప్రదాయంగా దీపం వెలిగించి నిర్వహించిన ప్రారంభోత్సవం.. లగ్జరీ రిటైల్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికింది అని చెప్పవచ్చు.
సుమారుగా 60 సంవత్సరాల క్రితం చైర్మన్ శ్రీ చంద్ మల్ తోట్ల స్థాపించిన కమల్ వాచ్ కో.. ఈ 60 ఏళ్ల కాలంలో విశ్వసనీయమైన సంస్థగా పేరు సొంతం చేసుకుంది. కమల్ లైఫ్ స్టైల్ హౌస్ ప్రారంభంతో ఈ వేదిక నగరానికి మరింత లగ్జరీ స్టైల్ బ్రాండ్స్ కు ప్రముఖ గమ్యస్థానంగా నిలుస్తోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ స్టోర్ 50కి పైగా ప్రీమియం ఫ్యాషన్ వాచ్ బ్రాండ్ల విభిన్నమైన సేకరణతో తన ప్రశస్తిని విస్తరిస్తుంది. అంతేకాకుండా క్యారెట్ లేన్ ద్వారా బంగారం, వెండి ఆభరణాలు, డెకరేటివ్ క్రిస్టల్స్, స్వరోవ్స్వీ ద్వారా చేసిన ఆభరణాలు, అంతర్జాతీయ హై అండ్ పెర్ఫ్యూమ్ లు క్యూరియేటెడ్ సెలక్షన్స్ ను కూడా ప్రదర్శిస్తోంది.
ఇకపోతే ఈ నూతన కమల్ లైఫ్ స్టైల్ హౌస్.. కష్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మాత్రమే కాకుండా అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్ , అద్భుతమైన ఇన్ హౌస్, విశాలమైన పార్కింగ్ అన్నింటికి మించి ఆత్మీయమైన ఆతిథ్యంతో మైమరిపించే విలాసమైన షాపింగ్ అనుభవాన్ని మీకు అందిస్తుంది. వారసత్వ వైభవంతో పాటు అధునాతన, ఆధునిక వైవిధ్యాన్ని ఒకే పైకప్పు కింద సమ్మిళితం చేస్తూ హైదరాబాదులో లైఫ్ స్టైల్ రిటైల్ ను పునర్నిర్మించడానికి సంసిద్ధంగా ఉంది అంటూ నిర్వాహకులు వెల్లడించారు.
ALSO READ: Kantara Chapter 1: కాంతార 2 ఫస్ట్ డే కలెక్షన్స్..ఆ సినిమాలన్నీ వెనక్కే?