Rajasthan News: రాజస్థాన్‌లో ఓ దగ్గు సిరప్ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన వ్యవహారం తీవ్రరూపం దాల్చుతోంది. దీని కారణంగా కొందరు చిన్నారులు సైతం అస్వస్థతకు గురయ్యారు. తాము రాసిన దగ్గు మందు సేఫ్ అని, దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిరూపించే ప్రయత్నం చేశాడు ఓ డాక్టర్. ఆ సిరప్‌ను డాక్టర్ తాగారు. 8 గంటల తర్వాత కారు లోపల అపస్మారక స్థితిలో కనిపించడం కలకలం రేపింది.
రాజస్థాన్‌లో సిరప్‌ల కలకలం
రాజస్థాన్‌లోని సికార్ జిల్లా చిరానాకు చెందిన ఐదేళ్ల నితీశ్‌ని దగ్గర్లోని బయానా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు పేరెంట్స్. అయితే బాలుడికి దగ్గు ఎక్కువగా ఉందని భావించిన డాక్టర్, ఓ సిరప్ రాసిచ్చాడు. రాత్రికి ఆ మందు తాగిన బాలుడు ఉదయం నిద్ర లేవలేదు. అప్పటికే ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు. వెంటనే భయపడిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.
ఇదే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మరో చిన్నారి కూడా ఈ సిరప్ తీసుకున్నాడు. దీంత ఆ బాలుడు కూడా మృతి చెందాడు. ఈ సిరప్ వల్ల ఇద్దరు చిన్నారులు మరణించడం రాజస్థాన్ లో కలకలం రేపింది. ఇదే క్రమంలో ముగ్గురు చిన్నారులకు ఈ సిరప్ తీసుకున్న తర్వాత స్పృహ కోల్పాయరు. చిన్నారులిద్దరూ విపరీతమైన వాంతులతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
డాక్టర్, అంబులెన్స్ డ్రైవర్‌కీ అదే పరిస్థితి
అదే సమయంలో బయానా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ తారాచంద్ యోగి సెప్టెంబర్ 24న ఆ సిరప్‌ను పేషెంట్ల ముందు తాగాడు. అది తీసుకున్న 8 గంటల తర్వాత కారు లోపల అపస్మారక స్థితిలో కనిపించాడు. సిరప్ వినియోగంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి.
ALSO READ: పండుగ రోజు ఆ ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
ఈ క్రమంలో రాజస్థాన్ ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. కేసన్ అనే కంపెనీ సరఫరా చేసిన 22 బ్యాచ్‌ల దగ్గు మందును నిషేధిస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ సిరప్‌లను నిలిపేస్తున్నట్లు అదేశాలు జారీ చేసింది.
అది సురక్షితమని నిరూపించడానికి డాక్టర్ యోగితోపాటు అంబులెన్స్ డ్రైవర్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత డాక్టర్ తన కారులో భరత్‌పూర్‌కు బయలు దేరాడు. మగతగా అనిపించడంతో రోడ్డు పక్కన ఆపి స్పృహ తప్పిపోయాడు. అప్పటికే డాక్టర్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మొబైల్ ద్వారా లొకేషన్‌ను ట్రాక్ చేశారు కుటుంబసభ్యులు.
ఎనిమిది గంటల తర్వాత అతను కారులో పడి ఉండటాన్ని గుర్తించారు. సిరప్ తీసుకున్న మూడు గంటల తర్వాత అంబులెన్స్ డ్రైవర్ కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత డాక్టర్, అంబులెన్స్ డ్రైవర్ క్రమంగా కోలుకున్నాడు.
జూలై నుంచి ఇప్పటివరకు దాదాపు లక్షన్నరు పైగా దగ్గు మందు సిరప్‌లు సరఫరా అయ్యాయి. వాటిలో 8,200 సీసాలు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో ఉన్నాయని గుర్తించారు అధికారులు. వాటిని కూడా నిషేధించినట్టు తెలుస్తోంది.