BigTV English

Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్ పండ‌గ చేసుకోవాలా? వ‌ద్దా?

Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్ పండ‌గ చేసుకోవాలా? వ‌ద్దా?

Akhil Akkineni:ముందు ఒక విష‌యంలో క్లారిటీ ఇవ్వండి మేం పండ‌గ చేసుకోవాలా? వ‌ద్దా? అని డైర‌క్ట్ గా సురేంద‌ర్‌రెడ్డిని నిల‌దీస్తున్నారు అక్కినేని అభిమానులు. ఏజెంట్ లోడింగ్ అంటూ ట్విట్ట‌ర్లో ట్రెండ్ అవుతోంది. ఇంత‌కీ ఇప్పుడు లోడ్ కావ‌డ‌మేంటి? ఎలాగూ ఇచ్చేది ఓ పోస్ట‌రేగా అని ఓ సారి సోష‌ల్ మీడియాని స‌ర్ఫ్ చేస్తే అక్కినేని అభిమానుల బాధ ఎలాంటివారికైనా అర్థ‌మ‌వుతుంది.మ‌రి సురేంద‌ర్‌రెడ్డి ఇదంతా వింటున్న‌ట్టా? లేదా?. లాస్ట్ ఇయ‌ర్ ఫుల్ ఎక్స‌ర్‌సైజ్డ్ బాడీతో అఖిల్ పోస్ట‌ర్ ఒకటి రిలీజ్ చేశారు. నెవ‌ర్ బిఫోర్ సీన్ అవ‌తార్ అంటూ ఆడియ‌న్స్ ఎంజాయ్ చేశారు. ఏజెంట్‌ని అదిగో రిలీజ్ చేస్తాం, ఇదిగో రిలీజ్ చేస్తాం అన్నారు. ఆ త‌ర్వాత మ‌మ్ముట్టి కాల్షీట్లు కుద‌ర‌లేద‌న్నారు. ఏదేమైతేనేం, స‌మంత య‌శోద సినిమా కాస్త లేట్‌గా అయినా రిలీజ్ అయింది కానీ, మ‌రిది అఖిల్ సినిమా 2022ని స్కిప్ చేసేసింది. మ‌రి 2023 మాటేంటి? ఎప్పుడు రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు? ఇంత ఆల‌స్యం ఎందుకు జ‌రుగుతోంది? అన్న‌ది అఖిల్ ఫ్యాన్స్ డౌట్‌.


నెవ‌ర్ బిఫోన్ సీన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌, నెవ‌ర్ బిఫోన్ సీన్ క్లైమాక్స్ సీన్, నాలుగు పాట‌లు, అద్దిరిపోయే ఇంట‌ర్వెల్‌తో ప‌వ‌ర్ ప్యాక్డ్ మూవీగా నిర్మిస్తున్నార‌ట ఏజెంట్‌ని. జ‌న‌వ‌రి 1న వ‌చ్చే అప్‌డేట్‌లోనూ ఈ విష‌యాల‌న్నిటినీ వివ‌రిస్తార‌ట‌. పోస్ట‌ర్ మామూలుగా ఉండ‌ద‌ని, రిలీజ్ డేట్ బోన‌స్ అనే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ప్రొడ్యూస‌ర్స్ ని, డైర‌క్ట‌ర్‌నీ ట్యాగ్ చేస్తూ, మా ప‌రువు తియ్య‌కండ్రా అయ్యా. కాస్త గ‌ట్టిగానే రివీల్ చేయండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఏప్రిల్ లో డేట్ ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ యాక్ష‌న్ సినిమా అవుతుంద‌ని, ఈ దెబ్బ‌తో అఖిల్ మాస్ హీరోగా సెటిల్ కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు మేక‌ర్స్.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×